కరోనా సోకి రుచి, వాసన కోల్పోతే…తిరిగి మాములుగా అవ్వడానికి ఎంత కాలం పడుతుంది?

కరోనా సోకి రుచి, వాసన కోల్పోతే…తిరిగి మాములుగా అవ్వడానికి ఎంత కాలం పడుతుంది?

by Mohana Priya

Ads

కరోనా లక్షణాల్లో ఒకటి లాక్ ఆఫ్ టేస్ట్. అంటే ఏ పదార్థం యొక్క రుచి తెలియకపోవడం. కానీ కరోనా నుంచి కోలుకున్న తర్వాత 49 శాతం మంది మళ్లీ రుచి తెలుసుకోగలుగుతున్నారట. ఇటీవల ఇటలీ లో నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

Video Advertisement

కానీ పది శాతం మంది మాత్రం తమకి ఎటువంటి రుచి తెలియటం లేదు అని ముందు కంటే కూడా ఈ లక్షణం ఇప్పుడు ఇంకా తీవ్రంగా ఉంది అని చెప్పారు. దగ్గు, తుమ్ము మాత్రమే కాకుండా రుచి, వాసన తెలియకపోవడం కూడా కరోనా యొక్క లక్షణమేనని డాక్టర్లు చెబుతున్నారు.

ఇలాంటి చిన్న చిన్న లక్షణాలు కనిపించినా కూడా నిర్లక్ష్యం చేయకుండా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండాలి. ఒకవేళ మనం మామూలు దగ్గు కావచ్చు అని వదిలేస్తే మనకి తెలియకుండా మనతోపాటు మన కుటుంబ సభ్యులకు కూడా వ్యాధి సోకే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

ఇటలీలో కరోనా నుండి కోలుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 187 మందిని అంతర్జాతీయ వైద్య పరిశోధన బృందం ఒక సర్వే చేసింది. వైరస్ ఉన్నప్పుడు వారి రుచి, వాసనలు గమనించే తీరు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చెప్పమన్నారు.

అందులో 113 మంది అప్పటికీ ఇప్పటికీ తేడా ఉంది అని చెప్పారు. 46 మంది రుచి చూడటం. వాసనలు తెలుసుకోవడం ఇప్పుడు మెరుగుపడిందని చెప్పారు. 55 మంది తాము పూర్తిగా సాధారణ పరిస్థితి కి వచ్చినట్టు చెప్పారు. 12 మంది మాత్రం అప్పటికంటే ఇప్పుడు ఇంకా రుచి, వాసన అస్సలు తెలుసుకోలేకపోతున్నాం అని చెప్పారు.

డాక్టర్లు వైరస్ సోకిన స్థాయిని బట్టి వాళ్లు కోలుకుంటారు అని చెప్పారు. అంటే “ఒకవేళ వైరస్ ముక్కు దగ్గర ఉండే కణాలకు మాత్రమే సోకితే అవి శరీరం మొత్తం పాకే అవకాశాలు ఉండవు. కాబట్టి వారు తొందరగా కోలుకుంటారు. కానీ ఒకవేళ వైరస్ నరాల వరకు పాకితే, ఆ నరాల్లో రుచికి సంబంధించిన నరాలు కూడా ఉంటాయి కాబట్టి కోలుకోవడం కష్టం.

కణాలు తిరిగి మామూలుగా అవ్వడానికి చాలా సమయం పడుతుంది. చిన్న ఆరోగ్య సమస్యలే కదా అని నిర్లక్ష్యం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఈ పరిస్థితుల్లో అది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఆరోగ్యం లో చిన్న మార్పు కనిపించినా కూడా సెల్ఫ్ ఐసోలేషన్ కి వెళ్లడం లేదా డాక్టర్ సహాయం తీసుకోవడం చేయాలి” అని అన్నారు.

మీరు కూడా ఇలాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే కరోనా హెల్ప్‌లైన్ నెంబర్లు 01123978046 (కేంద్ర ప్రభుత్వం), 104 (ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ) కి కాల్ చేయండి.


End of Article

You may also like