బెండకాయలతో ఇలా చేస్తే…”షుగర్” వ్యాధిని అదుపుచేయచ్చు.!

బెండకాయలతో ఇలా చేస్తే…”షుగర్” వ్యాధిని అదుపుచేయచ్చు.!

by Mohana Priya

Ads

సాధారణంగా మనుషుల్లో చాలా కామన్ గా వచ్చే ఆరోగ్య సమస్యల్లో షుగర్ ఒకటి. షుగర్ వ్యాధికి వయసుతో సంబంధం లేదు. చిన్న వాళ్ళకి, పెద్ద వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి ఇది హెరిడిటరీ గా వస్తుంది. బ్లడ్ గ్లూకోజ్ అంటే బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల డయాబెటిస్ వస్తుంది. ఈ బ్లడ్ గ్లూకోజ్ అనేది మనం తినే దాని మీద ఆధారపడి ఉంటుంది. డయాబెటిస్ లో టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ అని రెండు రకాలు ఉన్నాయి.

Video Advertisement

వైరస్ వల్ల, లేదా బీటా సేల్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల టైప్ 1 డయాబెటిస్ వస్తుంది అని, శరీరం ఇన్సులిన్ కి రెసిస్టెంట్ అయినప్పుడు, లేదా పాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయనప్పుడు, ఇంకా ఓవర్ వెయిట్ వల్ల టైప్ 2 డయాబెటిస్ వస్తుంది అని అంటారు. కానీ అసలు పైన చెప్పిన లక్షణాలు ఎందుకు కనిపిస్తాయి? కారణాలు ఏంటి? అనే వివరాలు మాత్రం అంత కరెక్ట్ గా ఎవరికీ తెలియదు అని అంటారు.

అయితే ఈ డయాబెటిస్ కంట్రోల్ అవ్వడానికి మెడిసిన్స్ వాడుతారు. కానీ ఇంట్లో లభించే వాటితో కూడా డయాబెటిస్ కంట్రోల్ లో ఉండేలా చూసుకోవచ్చు. అది ఎలాగంటే రెండు బెండకాయలు తీసుకొని వాటికి రెండు వైపులా చివర్లను కట్ చేసి, మధ్యలో కూడా చిన్నగా కట్ చేయాలి.

ఒక గ్లాసులో నీళ్ళు పోసి ఈ బెండకాయలని ఆ గ్లాస్ లో వేసి మూత పెట్టాలి. ఆ గ్లాస్ ని రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు తెల్లవారాక లేదా ఎర్లీ మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ కి ముందు ఆ గ్లాస్ లోని బెండకాయ ముక్కలను తీసేసి, ఆ నీళ్లు తాగాలి. ఇలా రెండు వారాల వరకు రోజూ చేస్తే షుగర్ చాలా వరకు అదుపు అయ్యే అవకాశాలు ఉంటాయి.


End of Article

You may also like