“నన్ను నమ్ము… వాడు మంచివాడు కాదు..!” అంటూ… వైరల్ అవుతున్న ఉదయ్ కిరణ్ చివరి లెటర్.!

“నన్ను నమ్ము… వాడు మంచివాడు కాదు..!” అంటూ… వైరల్ అవుతున్న ఉదయ్ కిరణ్ చివరి లెటర్.!

by Mohana Priya

Ads

ప్రముఖ నటుడు ఉదయ్ కిరణ్, తన మరణానికి ముందు రాసిన లేఖ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఉదయ్ కిరణ్ ఈ విధంగా రాసారు. “విషితా, నీతో చాలా చెప్పాలనుంది. మా అమ్మను ఎంతగా ప్రేమించానో నిన్ను అంతగా ప్రేమించాను. కానీ ఎందుకిలా చేస్తున్నావు.

Video Advertisement

ఒకప్పుడు నాకు అందరూ ఉండేవారు. ఇప్పుడు నువ్వు తప్ప ఎవరు లేరు. నాకు సినిమా పిచ్చితో ఇండస్ట్రీ కి వచ్చాను. ఈ ఇండస్ట్రీ నన్ను పిచ్చివాడిని చేసి ఆడుకుంది. నీకు ఇచ్చిన మాట నెరవేర్చలేకపోతున్నాను.

ఈరోజు కాల్ చేస్తా అన్న ప్రొడ్యూసర్ కూడా హ్యాండ్ ఇచ్చాడు. అందరికీ నేను పనికి రానివాడినయ్యానా? నిజమేనేమో. అందుకే అందరూ నన్ను దూరం పెట్టేసారు. నీతో సహా. విషి నన్ను నమ్ము, వాడు నిజంగా మంచి వాడు కాదు. ఐనా ఇప్పుడు ఏం చెప్పినా వినే స్టేజ్ లో నువ్వు లేవు. నాకు తెలుసు. దేర్ విల్ బి ఎ డే, ఆ రోజు నా మాటలు, నా బాధ నీకు కూడా అర్థం అవుతుంది. కానీ ఆ రోజు నీ పక్కన నీ ఉదయ్ ఉండడు. నువ్వు ఎంత ఏడ్చినా తిరిగి రాలేడు. అనవసరంగా మన గొడవల వల్ల అత్తమామలు ఇబ్బంది పడుతున్నారు. అది నాకు ఇష్టం లేదు. అందరికీ నా వల్లే కదా ఇంత బాధ. ఇక మీ ఎవరికీ ఈ బాధ ఉండదు.

uday kiran last letter goes viral

ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అలాగే నా లైఫ్ కి కూడా ఈరోజుతో ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ఒకసారి యు ఎస్ వెళ్లి ట్రీట్మెంట్ తీసుకో. ప్లీజ్. మా అమ్మ నగలు మా అక్కకి ఇచ్చేయ్.  అలా అయినా మా అమ్మ జ్ఞాపకాలు మా అక్క దగ్గర ఉంటాయి. అది నా చివరి కోరిక అనుకో. అమ్మా నాకు ఎవరూ లేరు అమ్మా. నువ్వు తప్ప. ఒకసారి నిన్ను గట్టిగా పట్టుకుని ఏడవాలని ఉందమ్మా. అందుకే వచ్చేస్తున్నా నీ దగ్గరికి. లవ్ యూ విషి. లవ్ యూ ఫరెవర్.

ALSO READ : “ఈ ఒక్క విషయం తేడా కొట్టింది..!” అంటూ… చిరంజీవి “భోళా శంకర్” పై కామెంట్స్..! ఏం జరిగిందంటే..?

sourced from: TV9 Telugu


End of Article

You may also like