జీవితంలో మనిషికి ముఖ్యమైనవి రెండే రెండు రోజులు. ఒకటి తను ప్రపంచంలోకి అడుగుపెట్టిన రోజు. ఇంకొకటి తను ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయిన రోజు. అంటే జననం ఇంకా మరణం. పుట్టిన తర్వాత బారసాల అన్నప్రాసన, చనిపోయిన తర్వాత అంత్యక్రియలు మనిషి ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి.

Video Advertisement

మరణం ఆసన్నమైన సమయం లో ఎవరు మాట్లాడలేకపోతు ఉంటారు. వారేమైనా చెప్పాలనుకున్నా కొన్ని సార్లు చెప్పలేకపోతారు. నిశ్శబ్దం గా లోకాన్ని వీడి వెళ్లిపోతుంటారు. ఐతే మరణం దగ్గరకు వచ్చే వరకు.. ఈ సమయం లో ఎలా ఆలోచిస్తూ ఉంటాం అన్న విషయం ఎవరికీ తెలియదు. అసలు చనిపోయేముందు ఏమి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

30 seconds 1

న్యూరో సైంటిస్ట్ లు చేసిన రీసెర్చ్ ప్రకారం మనిషి చనిపోవడానికి ఇంకా ఒక 30 సెకండ్ల సమయం ఉందనగా.. ప్రతి వ్యక్తికీ అప్పటివరకు అతనికి గడిచిన జీవితమంతా కళ్ళముందు తిరుగుతూ ఉంటుందట. పుట్టినప్పటి నుంచి.. చివరిదాకా కలిసి తిరిగిన మనుషులు, జ్ఞాపకాలు అన్ని గుర్తుకొస్తుంటాయట. 87 సంవత్సరాల మూర్ఛ వ్యాధి ఉన్న వృద్ధుడిని సైంటిస్ట్ లు పరిశీలించారట.

అతనికి సడన్ గా హార్ట్ ఎటాక్ రావడంతో పాటు బ్రెయిన్ లో ఉన్నట్లుండి ఊహించని యాక్టివిటీ చోటు చేసుకోవడాన్ని ఆ సైంటిస్ట్ లు గమనించారు. అంతేకాదు బ్రెయిన్ వేవ్స్ లో కూడా చాలా మార్పులు వచ్చాయట. చనిపోవడానికి 30 సెకన్ల ముందు మెదడు రక్తాన్ని తీసుకోదు. ఆ సమయంలో అతని జీవితంలోని ముఖ్య సంఘటనలు అన్నీ ఒక్కసారిగా కళ్ళముందు కనిపిస్తూ ఉంటాయి. గుండె కొట్టుకోవడం ఆగిపోయిన 30 సెకండ్ల తరువాత కూడా ఈ ప్రాసెస్ కొనసాగుతూనే ఉంటుంది. ఆ తరువాత మనిషి ఉండడు.. అతని జ్ఞాపకాలు ఉండవు.