సరైన సమయానికి భోజనం చేయకపోవడం వల్ల అనారోగ్యానికి గురి అయ్యే అవకాశం ఉంటుంది. సరైన తిండి, నిద్ర  లేకపోతే శరీరం మెల్లగా జబ్బు పడుతుందని చెబుతున్నారు. అందులోనూ ముఖ్యంగా అర్థరాత్రి భోజనం చేయడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెప్తున్నారు.

Video Advertisement

ఉదయం, పగటి సమయాలలో కొంచెం లేట్ గా భోజనం చేసినా కూడా పెద్దగా సమస్య ఉండదు.  కానీ ప్రతిరోజూ  కూడా రాత్రి పూట మాత్రం సమయమం ప్రకారం భోజనం చేయడం అలవాటు చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి సమయంలో వీలైనంత వరకు  8 గంటల లోపే డిన్నర్ పూర్తి చేయాలి. ఆ తర్వాత డిన్నర్  చేయడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం అని చెబుతున్నారు. ఎందుకంటే అర్థరాత్రి సమయంలో భోజనం చేయడం వల్ల సరిగ్గా జీర్ణం కాకపోవడం మరియు శరీరంలోని జీవక్రియల పనితీరు కూడా నెమ్మదించడం మొదలవుతుంది.
రాత్రి మనం తీసుకున్న ఆహారం జీర్ణం అయినప్పుడే మంచి నిద్ర పడుతుంది. అందువల్ల భోజనానికి మరియు  పడుకునే వేళకి మధ్య కనీసం రెండు గంటల సమయం ఉండాలి.  లేకపోతే  నిద్ర సంబంధితమైన ఇబ్బందులు  మొదలవుతాయి. తిన్న ఆహారం జీర్ణం అయ్యేందుకు కనీసం 2 గంటల సమయం పడుతుంది. అందువల్ల తిన్న తరువాత పడుకోవడానికి మధ్య 2 గంటల గ్యాప్ ఉండేలా చూసుకుంటే మంచిది.
ఇక రాత్రివేళ 8 గంటల లోపు డిన్నర్ చేయనట్లయితే పొట్ట చుట్టు కొవ్వు పేరుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల రక్తంలో షుగర్ స్థాయి పెరిగి షుగర్ వ్యాధి  వచ్చే అవకాశం ఎక్కువ. ఈ వ్యాధి బారిన పడకుండా  ఉండాలంటే  ఖచ్చితంగా సమయానికి ఆహారం తినడమే సరైన పరిష్కారం అని చెప్పవచ్చు.  ఆలస్యంగా భోజనం చేయడం వల్ల  ఎసిడిటి, అల్సర్ లాంటి సమస్యలు కూడా రావచ్చు. ఇక జీర్ణక్రియ అనే ప్రక్రియ సరిగ్గా జరగాలన్నా కూడా వేళకి ఆహారం తీసుకోవాలి. ఇది మాత్రమే కాకుండా రాత్రి పూట త్వరగా జీర్ణమయ్యే వాటిని తీసుకుంటే మంచిదని నిపుణులు చెప్తున్నారు.  ఆహారంలో కారం ఎక్కువగా తీసుకోకపోవడం, ఘాటైన మసాలాలను తగ్గిస్తే మంచిది. రాత్రి పూట ఆహారంలో సలాడ్లు, పండ్లు, జ్యూస్‌లు ఉండేలా చూసుకోవాలి.
Also Read:మీ వయస్సు తక్కువగా కనపడాలా..? అయితే ఈ 8 తప్పక తీసుకోండి..!