అదృష్టం కలిసి రావాలంటే…”లాఫింగ్ బుద్ధా” బొమ్మను ఏ ప్రదేశంలో పెట్టాలో తెలుసా.?

అదృష్టం కలిసి రావాలంటే…”లాఫింగ్ బుద్ధా” బొమ్మను ఏ ప్రదేశంలో పెట్టాలో తెలుసా.?

by Megha Varna

Ads

చాలామంది ఇళ్లల్లో లాఫింగ్ బుద్ధాని పెడుతూ ఉంటారు. ఎంత బాధగా వున్నా, ఏ చిక్కుల్లో ఉన్న ఒక్కసారి లాఫింగ్ బుద్ధాని చూస్తే ఎంతటి కోపం అయినా మాయమైపోతుంది. వెంటనే ముఖం మీదకి ఎక్కడలేని చిరునవ్వు వస్తుంది. ఎంతో హ్యాపీగా, రిలీఫ్ గా ఉంటుంది. లాఫింగ్ బుద్ధాని చూస్తే చిన్నపిల్లలు కూడా పక్కున నవ్వు తారు.

Video Advertisement

పైగా లాఫింగ్ బుద్ధ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. దురదృష్టం అంతా కూడా తొలగిపోయి అదృష్టం వస్తుంది. బంగారం రంగు లో ఇవి మనకి అందుబాటులో ఉంటాయి. గిఫ్ట్ షాపుల్లో మనం వీటిని విక్రయించచ్చు. అయితే లాఫింగ్ బుద్ధానిఇంట్లో పెట్టేటప్పుడు ఎక్కడ ఉంచితే మంచిది..?, ఎలాంటి ఫలితాలు పొందొచ్చు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఎంట్రన్స్ లో లాఫింగ్ బుద్ధాని పెట్టడం వల్ల ఇబ్బందులు ఉంటాయని తెలుస్తోంది. అయితే లోపలికి మనం కాలు పెట్టగానే ఇది మనకి కనపడేలా ఉంటే ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడవచ్చు. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి.. చాలా కాలం నుండి వాళ్లు చెల్లించకపోయినట్లయితే ఇంట్లో లాఫింగ్ బుద్ధాని పెట్టండి. వెంటనే అప్పు తీర్చేస్తారు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. అనారోగ్య సమస్యలను కూడా లాఫింగ్ బుద్ధాతో తరిమికొట్టొచ్చు.

అంతే కాదండీ ఎక్కువ ఒత్తిడితో ఇబ్బంది పడుతుంటే కూడా ఒత్తిడిని ఈ విగ్రహంతో తొలగించుకుని ఆనందంగా ఉండొచ్చు.
ఎంచుకున్న రంగంలో విజయాన్ని కలిగిస్తుంది ఇది. అలానే ప్రతికూల శక్తిని సానుకూలంగా మార్చేస్తుంది.

వ్యాపారులుకి నష్టాలు కలిగినా అమ్మకాలు సరిగ్గా జరగకపోయినా ఈ విగ్రహాన్ని పెట్టుకోండి. దీని వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆర్థిక లోటు అస్సలు ఉండదు. అంతేకాదు చెడు దృష్టి మీపై పడి ఇంట్లో ఆందోళన, సమస్యలు ఎక్కువైతే దీనిని ఉంచండి. దీనితో ప్రతికూల శక్తులు మీ నుంచి, మీ ఇంటి నుంచి దూరంగా వెళ్లిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య అనురాగం ఆప్యాయతలు కూడా లాఫింగ్ బుద్ధాని ఉంచడం వలన పెరుగుతాయి.


End of Article

You may also like