ఒకప్పుడు తమ అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్స్ ప్రస్తుతం కుటుంబంతో గడుపుతున్నారు. అయితే కొంత మంది సీనియర్ హీరోయిన్స్ రెండవ ఇన్సింగ్స్ మొదలు పెట్టి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కొందరు హీరోయిన్స్ మాత్రం తమ పూర్తి సమయాన్ని ఫ్యామిలీకే వెచ్చించారు. అలాంటి హీరోయిన్స్ లో లయ ఒకరు. ఆమె ‘స్వయంవరం’ చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు.
Video Advertisement
తొలి సినిమాతోనే తన నటనతో ప్రశంసలు పొందింది. ఆ తర్వాత ప్రేమించు మనోహరం వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా మారింది. లయ వరుసగా 3 నంది అవార్డులు పొందిన ఏకైన నటిగా గుర్తింపు తెచ్చుకుంది. సుమారు పదమూడు ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్‌గా కొనసాగిన లయ కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని నటనకు వీడ్కోలు చెప్పారు. కొన్ని రోజులుగా సామాజిక మధ్యమాలలో యాక్టివ్ గా ఉంటూ రీల్స్, ఫోటోషూట్స్, డ్యాన్సులతో ఆకట్టుకుంటున్నారు.
లయ భర్త, పిల్లలతో పాటు అమెరికాలో నివసిస్తున్నారు. ఇటీవల లయ హైదరాబాద్ కి వచ్చారు. ఈ క్రమంలో వరుసగా ఇంటర్య్వూలు ఇచ్చింది. ఈవాటిలో తను అమెరికాలో జాబ్ చేసినట్టు, అలాగే ఆమె శాలరీ గురించి ఇంట్రెస్టింగ్ సంగతులను తెలిపారు. 2006లోతాను వివాహం చేసుకుని అమెరికాకు వెళ్లానని, 2011 నుండి 2017 వరకు ఐటీ సెక్టార్‌లో ఉద్యోగం చేసినట్లు తెలిపింది. నాలుగు సంవత్సరాలు ఫుల్ టైం పని చేశానని, అది కూడా ఇండియాకు చెందిన ప్రముఖ ఐటీ కంపెనీకి వర్క్ చేసినట్లు చెప్పారు.
జాబ్ చేసే టైమ్ లో అన్ని ట్యాక్స్‌లు పోగా శాలరీ 12000 డాలర్స్ అని తెలిపింది. అనగా ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 960, 000. నాలుగేళ్లు తరువాత 2017లో ఉద్యోగం మానేసింది. అనంతరం తాను డాన్స్ స్కూల్ మొదలు పెట్టానని, కరోనా వల్ల అది కూడా మానేసి ఇంస్టాగ్రామ్ లో రీల్స్ మొదలు పెట్టానని తెలిపింది. ఎన్నో సంవత్సరాల తర్వాత హైదరాబాద్ వచ్చిన లయ హైదరాబాద్ ఎంతగానో చేంజ్ అయిందని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ, న్యూయార్క్ సిటీ కన్నా హైదరాబాదే ఎంతో బాగుందని తెలిపింది.
Also Read: “మానవుడు దానవుడు” తో పాటు… సూపర్ స్టార్ “కృష్ణ” డైరెక్ట్ చేసిన 11 సినిమాలు..!