నట శేఖర కృష్ణ..తెలుగు వెండి తెరకు సరికొత్త ఒరవడులుదిద్దుతూ.. ఆయన పరిచయం చేయని జోనర్ లేదు అంటే అతిశయోక్తి కాదు. సుమారు 50 ఏళ్ల క్రితమే పాన్ ఇండియా సినిమాను తెరకెక్కించారు. అప్పట్లో బాలీవుడ్ లో సత్తా చాటుతూ ఆ సినిమా కాసుల వర్షం కురిపించింది. దర్శకులు మాత్రమే కాదు నిర్మాతల పాలిట కల్పవృక్షం.. మంచి మనసున్న వ్యక్తి.. సినీ పరిశ్రమలోని 24 క్రాప్ట్స్ పై పట్టు ఉన్న కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో చేయని ప్రయోగం లేదు.
Video Advertisement
కృష్ణ తన నట జీవితం లో రెండు హిందీ సినిమాలతో పాటు, పలు తెలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు. కృష్ణ దర్శకుడిగా 16 చిత్రాలు చేశారు. అవేంటో చూద్దాం..
#1 సింహాసనం
కృష్ణ దర్శకత్వం వహించిన ఫస్ట్ మూవీ ‘సింహాసనం’. తెలుగులో తొలి70 ఎం.ఎం. మూవీ కూడా ఇదే. ఇందులో కృష్ణ నటించడంతో పాటు స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, ఎడిటింగ్ చేశారు.
#2 సింగాసన్
‘సింహాసనం’ మూవీని జితేంద్ర హీరోగా ‘సింగాసన్’ పేరుతో రీమేక్ చేశారు.. అక్కడ కూడా ఘనవిజయం సాధించి.. కాసుల వర్షం కురిపించింది.
#3 శంఖారావం
కృష్ణ, తనయుడు మహేష్ బాబుతో నటించడమే కాక.. స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్, డైరెక్షన్ చేసిన ఈ యాక్షన్ ఫిలిం సూపర్ హిట్ అయ్యింది..
#4 కలియుగ కర్ణుడు
నటశేఖర నటిస్తూ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ చేసిన మరో మూవీ ‘కలియుగ కర్ణుడు’. ఇందులో ఆయన పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా నటించారు.
#5 ముగ్గురు కొడుకులు
రమేష్ బాబు, మహేష్ బాబులతో కలిసి నటించి.. స్క్రీన్‌ప్లే, డైరెక్షన్, ఎడిటింగ్ కూడా చేశారు సూపర్ స్టార్. పద్మాలయా స్టూడియోస్ బ్యానర్ మీద కృష్ణ గారి అమ్మ గారు ఘట్టమనేని నాగ రత్నమ్మ ఈ చిత్రాన్ని నిర్మించారు.
#6 కొడుకు దిద్దిన కాపురం
కొడుకు మహేష్ బాబుతో నటించగా సూపర్ హిట్ అయిన ఫ్యామిలీ పిక్చర్.. ‘కొడుకు దిద్దిన కాపురం’. ఇందులో మహేష్ ద్విపాత్రాభినయం చేసారు.
#7 అన్నా – తమ్ముడు
కృష్ణ, మహేష్ అన్నాదమ్ముళ్లుగా నటించిన ఈ చిత్రానికి ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఎడిటర్, స్క్రీన్‌ప్లే రైటర్ కూడా కృష్ణే.
#8 బాలచంద్రుడు
బాల నటుడిగా స్టార్ స్టేటస్ తెచ్చుకున్న మహేష్ ని ప్రధాన పాత్రలో నటింపజేస్తూ.. దర్శకత్వంతో పాటు ఎప్పటిలానే తన శాఖలన్నిటికీ పని చేశారు కృష్ణ.
#9 ఇంద్రభవనం
తమ్ముడు జి.నరసింహ రావు నిర్మాతగా వచ్చిన కృష్ణ, కృష్ణంరాజుల మల్టీస్టారర్ మూవీ ఇది. ఇది పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ లో వచ్చింది.
#10 మానవుడు.. దానవుడు
కృష్ణ నాయకుడిగా, ప్రతి నాయకుడిగా ద్విపాత్రాభినయం చేస్తూ.. సమర్పణతో పాటు స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ చేశారు.
#11 ఇష్క్ హై తుమ్‌సే
తెలుగులో వచ్చిన ‘సంపంగి’ చిత్రాన్ని హిందీ లో ‘ఇష్క్ హై తుమ్‌సే’ గా రీమేక్ చేసారు కృష్ణ. డినో మోరియా, బిపాషా బసు ప్రధాన పాత్రల్లో నటించారు. పద్మాలయా బ్యానర్ మీద కృష్ణ గారి సోదరుడు జి.ఆదిశేషగిరి రావు నిర్మించగా.. నటశేఖర డైరెక్ట్ చేశారు. దర్శకుడిగా ఆయనకు ఇదే చివరి సినిమా.