Ads
మనుషులు అన్నాక ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. అయితే కొన్ని సమస్యలకి డాక్టర్ల దగ్గరికి వెళ్తాం. కానీ కొన్ని సమస్యలు మాత్రం ఇంట్లోనే పరిష్కరించుకోవచ్చు. వంటింట్లో ఉండే వంట సామాన్లు కేవలం తినడానికి మాత్రమే కాదు. ఔషధాలుగా కూడా పనిచేస్తాయి.
Video Advertisement
అందుకే దగ్గు, జలుబు, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు కొన్ని రకమైన ఆహార పదార్థాలు తీసుకున్న తర్వాత వెంటనే నయం అయిపోతాయి. అయితే మన ఇంట్లో ఉండే ఇతర సమస్యలని నివారించడానికి కూడా వంట రూమ్ లో ఉండే కొన్ని వస్తువులు, కొన్ని పదార్థాలు ఉపయోగిస్తారు.
సాధారణంగా దోమల బెడద ప్రతి ఇంట్లో ఎక్కువగానే ఉంటుంది. ప్రతి కాలంలోనూ దోమలు ఉంటాయి. కానీ కొన్ని కాలాల్లో మాత్రం దోమలు మరీ విపరీతంగా ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో ఫ్యాన్ లేకుండా ఉండడం ఒక కష్టమైన విషయం అయిపోయింది. ఎందుకంటే, ఫ్యాన్ వేసుకుంటే చలి వేస్తుంది. కానీ ఫ్యాన్ వేసుకోకపోతే దోమలు చుట్టు తిరుగుతూనే ఉంటాయి. దాని బదులు ఫ్యాన్ వేసుకోవడమే నయం అనుకుంటారు. కేవలం చలికాలంలో మాత్రమే కాదు. ప్రతి కాలంలోనూ దోమలు వస్తూనే ఉంటున్నాయి.
దోమలని నివారించడానికి ఆల్ అవుట్ వంటి మెషిన్లు, మస్కిటో కాయిల్స్ వాడతాము. కానీ మస్కిటో కాయిల్స్ వల్ల వచ్చే పొగ కొందరికి పడదు. అయితే ఇంట్లోనే ఉండే కొన్ని సామాన్లు తీసుకొని ఈ దోమలను నివారించవచ్చు. అందులో మొదటిగా నిమ్మకాయ, లవంగాలు. నిమ్మకాయని సగానికి కోసి కొన్ని లవంగాలని గుచ్చి, ఆ నిమ్మకాయ చెక్కని రూమ్ లో కానీ, హాల్ లో కానీ పెట్టాలి. ఒక ఆరు, ఏడు లవంగాలు వాడితే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల దోమలు రావు. అయితే రోజు నిమ్మకాయని, లవంగాలని మారుస్తూ ఉండాలి. వెల్లుల్లితో కూడా దోమలని తగ్గించవచ్చు.
కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకొని, వాటిని నీటిలో నానబెట్టి, ఆ తర్వాత ఆ నీటిని తీసి, వాటిని ఒక పేస్ట్ లాగా చేసి, దాన్ని నీళ్లల్లో కలిపి, దోమలు ఉన్న ప్రదేశంలో స్ప్రే చేయాలి. వెల్లుల్లిలో సల్ఫర్ ఉంటుంది. దీని కారణంగా దోమలు మాత్రమే కాకుండా, ఈగలు, ఇంకా ఎటువంటి పురుగులు కూడా రావు. ఇది మాత్రమే కాకుండా కర్పూరం కూడా దోమలని, ఈగలని దూరం చేయడానికి ఉపయోగిస్తారు. ఒక గిన్నెలో నీళ్లు పోసి, కర్పూరం బిళ్ళలు వేసి, ఏదైనా గదిలో లేదా హాల్ లో పెడితే ఆ వాసనకి దోమలు బయటికి వెళ్లిపోతాయి. ఇలా ఇంట్లో ఉండే పదార్థాలను ఉపయోగించి దోమలని దూరం చేయవచ్చు.
ALSO READ : ఈ అమ్మాయిని చెత్తబుట్టలో నుంచి ఒక స్టార్ హీరో తెచ్చి పెంచాడు…ఇప్పుడు హీరోయిన్ లా ఎలా ఉందో చూడండి.!
End of Article