Ads
లోకేశ్ కనగరాజ్ తనదైన శైలిలో సినిమాలు తెరకెక్కిస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. స్టార్ హీరోలతో సినిమాలు తీస్తూ, హిట్స్ అందుకుంటూ తక్కువ సమయంలోనే కోలీవుడ్ అగ్ర దర్శకులలో ఒకరిగా మారిపోయారు. ఆయన సినిమాలకు దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Video Advertisement
దర్శకుడిగా ఓ ట్రెండ్‌ను సెట్ చేసిన లోకేశ్ కనగరాజ్ రీసెంట్ గా ప్రొడ్యూసర్ గా మారిన విషయం తెలిసిందే. ఆయన నిర్మించిన తొలి మూవీ ఫైట్ క్లబ్. ఈ చిత్రం తాజాగా ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. మరి సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
సంచలన దర్శకుడు లోకేశ్ కనగరాజ్ నిర్మాతగా మారి తీసిన తమిళ చిత్రం ఫైట్ క్లబ్. ఈ చిత్రంలో విజయ్ కుమార్, మోనీషా మోహన్ మీనన్ జంటగా నటించారు. ఏ రహమత్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. గత ఏడాది డిసెంబర్ 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. 5 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను, 9 కోట్ల రూపాయలకు కు పైగా షేర్ ను వసూలు చేసింది. జనవరి 27 నుండి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, నార్త్ చెన్నై ప్రాంతంలో సెల్వ (విజయ్ కుమార్) అనే యువకుడు ఫుట్‌బాల్ ప్లేయర్ కావాలని కలలు కంటాడు. అయితే ఆ ప్రాంతంలో పిల్లలు స్కూల్ కి వెళ్ళకుండా గూండాలు మరియు డ్రగ్ పెడలర్స్ గా మారుతుంటారు. అక్కడి పరిస్థితులను మార్చాలనుకునే బెంజిమన్(కార్తికేయన్ సంతానం), సెల్వ ఫుట్‌బాల్ ప్లేయర్ ఎదగడానికి సహకరిస్తుంటాడు. రౌడీ కిర్బా (శంకర్ థాస్) బెంజీని అతని బ్రదర్ జోసెఫ్ (అవినాష్ రఘుదేవన్)తోనే హత్య చేయిస్తాడు. ఆ తరువాత పోలీసులు జోసెఫ్ ను జైలుకు పంపిస్తారు. బెంజి మరణంతో సెల్వ జులాయిగా, రౌడీగా మారతాడు.
రౌడీ కిర్బా రాజకీయ నాయకుడిగా ఎదుగుతాడు. జైలు నుంచి రిలీజ్ అయిన జోసెఫ్ కిర్బా తనను మోసం చేసినట్టు గ్రహిస్తాడు. అతని పై పగ తీర్చుకోవడానికి సెల్వను వాడుకోవాలనుకుంటాడు. ఆ తరువాత ఏం జరిగింది? ఫుట్‌బాల్ ప్లేయర్ కావాలని కలలు కన్న సెల్వ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనేది మిగిలిన కథ. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఫైట్ క్లబ్ మంచి ఛాయిస్.
Also Read: పార్ట్ 1 సూపర్ హిట్.. ఇప్పుడు పార్ట్ 2 కూడా వస్తుంది..! అసలు ఏం ఉంది ఇందులో..!
End of Article