Ads
సాధారణంగా 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఎవరైనా సరే ఇంకా ఆడుతూ పాడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క జీవితంలో ఏం చేయాలి అనే దానికి కూడా పెద్దగా అవగాహన ఉండదు. కానీ ఏళ్ల లేపా ర్యాడిక్ 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఉరికంబం ఎక్కి ఫ్రీడమ్ ఫైటర్ గా నిలిచింది. మరి ఇంత గొప్ప యువతి గురించి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మనం చూద్దాం.
Video Advertisement
ఈమె రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో చేసిన పనులను చూస్తే అభినందిస్తారు. ఈమె అత్యంత బలమున్న మహిళ. యుగోస్లేవియా అనే ఒక చిన్న దేశం నాజీ చేతిలో ఉన్నప్పుడు లేపా ర్యాడిక్ కి 15 సంవత్సరాలు. ఆమె అప్పుడు కమ్యూనిస్ట్ యూత్ మెంబర్ అయింది. అప్పుడే పార్టీసన్స్ అండర్ గ్రౌండ్ మూమెంట్ మొదలయ్యింది. ఆ సమయంలో యాక్సెస్ పవర్ వెళ్లి వీళ్ళ మీద దండయాత్ర చేయడం జరిగింది.
ఆక్సిస్ పవర్ ఎటాక్ చేసినప్పుడు లేప కుటుంబం అంతా కూడా బంధీ అయింది. అప్పుడు లేప మరియు తన సోదరిని పార్టీసన్స్ అండర్ గ్రౌండ్ మెంబర్స్ కాపాడారు. తర్వాత ఆమె కమ్యూనిస్టు పార్టీలో చేరింది. నర్స్ గా, ఫీల్డ్ యాక్టివిస్ట్ గా, నాయకురాలిగా పని చేసింది. యుద్ధాల్లో కూడా అన్ని విధాలుగా ఈమె సేవ చేసింది. తర్వాత 100 మంది బందీలు ఉండే మిషన్ లో ఆమె వాళ్లని సేవ్ చేయాలని అనుకుంది. కానీ నాజీలకు ఈమె దొరికిపోయింది.
అయితే గ్రూప్ సీక్రెట్ గురించి ఆమెని టార్చర్ చేయడం మొదలుపెట్టారు. అయినప్పటికీ ఆమె నోరు విప్పలేదు. ఎంత చెప్పినా ఆమె ఏమాత్రమూ చెప్పలేదు. దీంతో ఆమె కి మరణ శిక్ష విధించారు. ఉరితాడు మెడలో వేస్తూ ఆమెకి ఆఖరి అవకాశాన్ని కూడా నాజీ ఇచ్చారు కానీ ఆమె నాజీ కళ్ళల్లోకి చూస్తూ నేను దేశద్రోహి కాదు అని చెప్పింది. అలానే చనిపోయేంత వరకు ఆమె తన ధైర్యాన్ని కోల్పోయారు.
మీరు ఎవరి గురించి అయితే ఆడుగుతున్నారో వారే బయటకి వస్తారని.. మిమ్మల్ని మట్టికల్పిస్తారని ఆమె చెప్పింది. అలానే లాంగ్ లివ్ ద కమ్యూనిస్ట్ పార్టీ ఎండ్ పార్టీసన్స్.. ఫైట్, పీపుల్ ఫర్ యువర్ ఫ్రీడమ్ మీరు ఈ దుర్మార్గులకు సరెండర్ అవ్వద్దు. నేనైతే చంపబడతాను అని ఆమె అంది. తర్వాత నాజీల పై విజయాన్ని సాధించడం జరిగింది. ఇలా ఆమె మరణానికి చెప్పిన మాటలు నిజమయ్యాయి.
End of Article