ఆలయంలోని ఆ స్థంభం గాల్లో వేలాడుతుంది…వెనకున్న కథ ఏంటో తెలుసా.?

ఆలయంలోని ఆ స్థంభం గాల్లో వేలాడుతుంది…వెనకున్న కథ ఏంటో తెలుసా.?

by Mohana Priya

Ads

మన దేశ ఆలయాల్లో ఎంతో ప్రసిద్ధి గాంచిన ఆలయం లేపాక్షి. లేపాక్షి మన తెలుగు రాష్ట్రాల్లో ఉండటం ఇంకా విశేషం. అనంతపురం కి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న లేపాక్షి గ్రామంలో 16వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించబడింది. లేపాక్షి ఆలయంలో ఉన్న స్వామివారిని వీరభద్రస్వామి గా పూజిస్తారు.కానీ లేపాక్షికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? ఆ పేరు వెనుక ఒక కథ ఉంది.

Video Advertisement

రామాయణంలో రావణాసురుడు సీతాదేవిని తీసుకు వెళుతుంటే జటాయువు అనే పక్షి రావణుడిని ఆపడానికి ప్రయత్నిస్తుంది. రావణాసురుడు తనకి అడ్డుపడుతున్న జటాయువు రెక్క పై కత్తితో దాడి చేస్తాడు. గాయపడిన జటాయువు కింద పడిపోతుంది. జటాయువుని చూసిన రాముడు “లే పక్షి” అని పక్షిని పిలుస్తాడు. దాంతో జటాయువు కింద పడిన ప్రదేశానికి లేపాక్షి అని పేరు వచ్చింది.

లేపాక్షి లో ఇంకో ముఖ్యమైన విశేషం వేలాడే స్థంభం. స్థంభం నేలకు ఆనకుండా గాలిలో ఉంటుంది. లేపాక్షి ని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు వేలాడే స్థంభం కింద ఏదైనా వస్త్రం పెట్టి, లేదా ఏదైనా వస్తువు పెట్టి నిజంగానే స్థంభం గాలి లో ఉందా అని చూస్తూ ఉంటారు. స్థంభానికి నేల కి మధ్య దాదాపు పావు అంగుళం తేడా ఉంటుంది.

ఆ స్థంభం అలా గాలిలో ఉండడానికి కారణం ఏంటి అంటే, భూకంపాలు లాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, మిగిలిన స్థంభాలన్నీ తమ స్థానం లో నుండి జరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు గాలిలో వేలాడే స్థంభం నేలను ఆనుకొని మిగిలిన స్థంభాలు కదలకుండా ఉండేలా చేస్తుంది. అలా ముందు జాగ్రత్త కోసం ఈ స్థంభం గాలిలో ఉంటుంది.


End of Article

You may also like