LEVOCET USES: లెవోసెటైరిజిన్ వలన ఏ సమస్యలు దూరం అవుతాయి..? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి..?

LEVOCET USES: లెవోసెటైరిజిన్ వలన ఏ సమస్యలు దూరం అవుతాయి..? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి..?

by Megha Varna

Ads

లెవోసెటైరిజిన్ అనేది యాంటిహిస్టామైన్ అనే మెడిసిన్ గ్రూప్ కి చెందినది. ముక్కు కారడం, కాళ్ళ నుండి నీళ్లు రావడం, తుమ్ములు, దురద, అలెర్జీలతో సంబంధం కలిగి ఉన్న దద్దుర్లు వంటి వాటి కోసం ఈ మాత్రలు పని చేస్తాయి. ద్రావణము రూపంలో కూడా ఇది అందుబాటు లో వుంది.

Video Advertisement

ఇతర ఔషధాలతో పాటు ఈ మందును కూడా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు.  దద్దురులు వలన వచ్చే దురద నుండి ఉపశమనం లభిస్తుంది. శరీరం యొక్క కణాలు నుండి ఒక రసాయన, హిస్టామైన్ విడుదలను బ్లాక్ చేస్తుంది.

మీ వయస్సు, మీ పరిస్థితి యొక్క తీవ్రత, వైద్య చరిత్ర ని చూసి డాక్టర్లు డొసేజ్ ని చెబుతారు. ఈ మెడిసిన్ ని పగటి పూట తీసుకోవద్దు. సాయంత్రం తీసుకోవడమే మంచిది. అప్పుడు మగత అనుభూతి చెందకుండా నిరోధించవచ్చు.

లెవోసెటైరిజిన్ గురించి మరి కొన్ని ముఖ్య విషయాలు…

  • ఈ ఔషధం యొక్క ప్రభావం 24 గంటల పాటు ఉంటుంది. ఈ మాత్ర ని వేసుకున్న గంటలోనే దీని ప్రభావం పడుతుంది.
  • పాలిచ్చే తల్లులు ఈ ట్యాబ్లేట్స్ ని తీసుకు రాదు. శిశువు మీద దుష్ప్రభావాల ప్రమాదం పడచ్చు. మీకు అలెర్జీ తెలిసిన చరిత్ర ఉన్నట్లయితే లెవోసెటైరిజిన్ ని ఉపయోగించకూడదు.

  • మూత్రపిండాల వ్యాధితో బాధపడుతుంటే కూడా వేసుకోకకూడదు.
  • లెవోసెటైరిజిన్ ని కాలానుగుణ మరియు దీర్ఘకాలిక రినైటిస్తో సంబంధం ఉన్న లక్షణాల చికిత్స కోసం ఉపయోగిస్తారు. దద్దురులు వంటివి కలిగితే కూడా ఈ మందు తీసుకోవచ్చు.
  • అధిక మోతాదు లో తీసుకోకూడదు. అధిక మోతాదు లో తీసుకుంటే డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. అలానే మద్యం తో కూడా దీన్ని తీసుకోకూడదు.

ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయి..?

నిద్రమత్తుగా ఉండడం
తలనొప్పి
ముక్కు కారడం, దగ్గు
మసక మసకగా కనిపించడం
నోరు ఆరిపోవడం
విరేచనాలు
వికారం లేదా వాంతులు
మూత్ర విసర్జనప్పుడు కష్టంగా ఉండడం

Levocetirizine వలన కలిగే ఉపయోగాలు:

లెవోసెటిరిజైన్ అనేది యాంటిహిస్టామైన్. దీని వలన కళ్ళు నీరు కారడం, ముక్కు కారటం, కళ్ళు/ముక్కు దురద వంటివి తగ్గుతాయి. తుమ్ములు వంటి కొన్ని అలెర్జీల లక్షణాలు కూడా తగ్గుతాయి.
దద్దుర్లు, దురదలని తగ్గించడానికి కూడా దీన్నిఉపయోగిస్తారు. అలెర్జీ ప్రతిచర్య (హిస్టామిన్) టైం లో కూడా ఇది పని చేస్తుంది.

 


End of Article

You may also like