అమ్మాయిల కోసం తొలిసారి స్కూల్ నడిపిన తొలి లేడీ టీచర్.. ఈమె గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..!

అమ్మాయిల కోసం తొలిసారి స్కూల్ నడిపిన తొలి లేడీ టీచర్.. ఈమె గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే..!

by Anudeep

Ads

భారత దేశంలో ఒకప్పుడు ఆచారాలు, మూఢ నమ్మకాలూ ఎక్కువగా ఉండేవి. అమ్మాయిలను కేవలం వంటింటికే పరిమితం చేసేవారు. చిన్న వయసులోనే పెళ్లి చేసేసి.. బాధ్యతలను అప్పగించేవారు. ఈ పరిస్థితిలో వారికి లోకజ్ఞానం తక్కువగా అలవడేది. ఇలాంటి పరిస్థితిల్లో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి.. మహిళలకు విద్య అవసరం అన్న విషయంపై అవగాహనా కల్పించడం అంత తేలిక కాదు.

Video Advertisement

అప్పటికే.. దేశంలో సతీ సహగమనం వంటి ఆచారాలు హెచ్చు మీరి ఉన్నాయి. వీటిని రూపుమాపడానికి సంఘసంస్కర్తలు కూడా పూనుకున్నారు. అటువంటి రోజుల్లో మహిళలను విద్య ద్వారా చైతన్య పరచాలని కంకణం కట్టుకున్నారు సావిత్రి బాయి పూలె.

savitribhai 5

ఆమె పూణేలోని భిడే వాడాలో బాలికల కోసం మొదటి పాఠశాలను స్థాపించింది. ఆమె మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా పేరు పొందారు. ఆమె 1831 జనవరి 3న మహారాష్ట్రలోని నైగావ్‌లో రైతుల కుటుంబంలో జన్మించారు. సావిత్రీబాయికి 9 సంవత్సరాల వయస్సులో 12 ఏళ్ల జ్యోతిరావు ఫూలేతో వివాహం జరిగింది. ఆమె నిత్యం ఏదోకటి నేర్చుకోవాలన్న తపనతో ఉండేది. ఇది ఆమె భర్త జ్యోతిరావు పూలె ను ఆకట్టుకుంది.

savitribhai 3

ఆమెకు చదవడం మరియు వ్రాయడం నేర్పించారు. ఆ తర్వాత ఆమె అహ్మద్‌నగర్‌లోని శ్రీమతి ఫరార్ ఇన్‌స్టిట్యూట్‌లో మరియు పూణెలోని శ్రీమతి మిచెల్ స్కూల్‌లో శిక్షణ పొందింది. 1848 జనవరి 1న మహారాష్ట్రలోని పూణేలోని భిడే వాడాలో బాలికల కోసం మొదటి పాఠశాలను స్థాపించి భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా నిలిచారు. ఆమె తన మొదటి బ్యాచ్ కి పాఠం బోధించినప్పుడు 8 మంది మహిళా విద్యార్థినులు మాత్రమే ఉన్నారు.

savitribhai 2

ఆ రోజుల్లో, మహిళలు పని చేయడానికి తమ ఇళ్ల నుండి బయటకు రానిచ్చేవారు కాదు. కానీ, సావిత్రి బాయి పాఠాలు చెప్పడం కోసం బయటకు వస్తే.. ఆమెను సనాతన పురుషులు కించపరిచేవారు. కుళ్ళిన గుడ్లు మరియు ఆవు పేడతో కొట్టేవారు. ఇన్ని అవమానాలను ఎదుర్కొన్నా సావిత్రిబాయి వెనక్కి తగ్గలేదు. తన భర్త కూడా ఆమెకి మరో చీరని కొనిచ్చి ప్రోత్సహించేవారు. ఆ మురికి చీరతో అలానే పాఠశాలకు వెళ్లి.. అక్కడ చీరని మార్చుకుని పాఠాలు బోధించేవారు. 1851 నాటికి, ఆమె పాఠశాలలో 150 మంది బాలికలు చేరారు. వీరి కోసం ఆమె మూడు పాఠశాలలను నడిపేది.

savitribhai 4

సావిత్రీబాయి తన దత్తపుత్రుడు, యశ్వంత్ వివాహాన్ని ‘సత్య శోధక్ సమాజ్’ లేదా సత్యాన్వేషకుల సంఘం ఆధ్వర్యంలో, పూజారులు లేకుండా, కట్నం లేకుండా మరియు చాలా తక్కువ ఖర్చుతో నిర్వహించారు. పెళ్లికి ముందు ఆమె తన కొడుకు కాబోయే భార్యను కూడా ఇంటికి తీసుకొచ్చింది. అలా ఆమెకి తాను ఉండబోయే ఇంటి గురించి ముందే తెలుస్తుందని భావించింది. ఆ అమ్మాయికి కూడా చదువుకోవడానికి అనువైన పరిస్థితిని కల్పించింది.

savitribhai 1

ఇప్పుడు నడుస్తున్న స్త్రీవాదం అప్పట్లో లేదు.. ఈ స్త్రీవాదం ఫ్యాషన్ కాకముందే ఆమె మహిళా విముక్తి యొక్క నిజమైన అర్థాన్ని అర్థం చేసుకుంది. ఆమె భర్త 1890లో మరణించారు. ఆ సమయంలో కూడా ఆమె మరో మూఢనమ్మకాన్ని రూపుమాపింది. తన భర్త అంత్యక్రియలను ముందుండి నడిపించింది. అంత్యక్రియలకు మట్టి కుండను ఆమె స్వయంగా తీసుకుని ఊరేగింపుగా వెళ్ళింది. 1897లో పూణే ప్లేగు బారిన పడినపుడు, ఆమె ముండ్వా నుండి 10 ఏళ్ల బాలుడిని తన వీపుకు కట్టుకుని క్లినిక్‌కి తీసుకెళ్లింది. బాలుడు కోలుకున్నాడు కానీ సావిత్రీబాయికి ఇన్ఫెక్షన్ సోకింది మరియు మార్చి 1897లో ఆమె తుది శ్వాస విడిచింది. చావుని కూడా లెక్కచేయకుండా ఓ బాలుడిని కాపాడింది. నేడు చదువుకుంటున్న ప్రతి అమ్మాయి ఆమెకు రుణపడి ఉండాలి. ఆమె గౌరవార్ధం పూణే యూనివర్సిటీకి 2014లో సావిత్రీబాయి ఫూలే యూనివర్సిటీ అని నామకరణం చేసారు.


End of Article

You may also like