“లైగర్” సినిమాలో ఈ సీన్ గమనించారా..? ఎక్కడో చూసినట్టు ఉంది కదా..?

టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నాడు.అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాతోనే ఎంతో మంది ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్నాడు.ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకోగా సక్సెస్ లతో పాటు ఫ్లాపులను కూడా ఎదుర్కొన్నాడు.

ఇక తాజాగా స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం లైగర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాపై ప్రేక్షకుల నుండి భారీ అంచనాలే పెట్టుకోగా అన్ని తలకిందులయ్యాయి.

liger climax scene is inspired from that super hit movie
అయితే లైగర్ ప్రమోషన్‌లో భాగంగా పూరి జగన్నాథ్, దర్శకుడు సుకుమార్ చిట్ చాట్ చేసారు. ఇందులో భాగంగా వారు లైగర్ తో పటు అనేక విషయాలు మాట్లాడుకున్నారు. పూరి జగన్నాథ్ ని చూసి సినిమాలు ఎలా త్వరగా తియ్యాలో నేర్చుకున్నానని సుకుమార్ పేర్కొన్నారు.

liger climax scene is inspired from that super hit movie
ఈ చిట్ చాట్ లో పూరి ఒక ఆసక్తి కరమైన విషయాన్ని గురించి వెల్లడించారు. పుష్ప క్లైమాక్స్ సన్నివేశాలను ఇన్స్పిరేషన్ గా తీసుకొని లైగర్ క్లైమాక్స్ ను తీశానని పూరి చెప్పుకొచ్చాడు. కానీ పుష్ప సినిమాలో ఇవే సన్నివేశాలు చాలా పవర్ఫుల్ గా అనిపించి నెక్స్ట్ పార్ట్ పై ఆసక్తి కలిగించేలా చేసాయి. కానీ లైగర్ విషయం లో అది రివర్స్ అయ్యింది. మైక్ టైసన్ వంటి వ్యక్తిని ఆలా ఎలా అవమానిస్తారని కామెంట్లు వ్యక్తమయ్యాయి.

liger climax scene is inspired from that super hit movie
పుష్ప చిత్రం చివరికి వచ్చే సరికి అల్లు అర్జున్, ఫహద్ ఫాసిల్ పత్రాలు బలం గా ఉన్నాయి. అది క్లైమాక్స్ కి వచ్చే సరికి ప్లస్ పాయింట్ అయ్యింది.తర్వాత పార్ట్ పై ఆసక్తి కలిగించడంలో సుకుమార్ విజయం సాధించారు.

liger climax scene is inspired from that super hit movie
అదే లైగర్ విషయంలో మైక్ టైసన్ పాత్ర పరిచయం, చాలా వీక్ గా ఉంది. ఒక రౌడీ లాగా అతడి పాత్ర చిత్రీకరించారు. దీంతో ఆ పాత్ర తో ఎవరు రిలేట్ కాలేదు. ఫలితంగా, క్లైమాక్స్ లో విజయ్ దేవరకొండ మరియు మైక్ టైసన్ మధ్య పోరాటం టోటల్ బస్ట్ గా మారింది. పుష్ప క్లైమాక్స్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా ఆ మేజిక్ క్రియేట్ చెయ్యడం లో పూరి ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి.