Ads
ఒకొక్కసారి మన ఇంట్లో భోజనం అందుబాటులో ఉండకపోవచ్చు. వంట రానివారికి చేసుకోవడం కష్టమే. వంట వచ్చిన వాళ్ళకి కూడా ఒకొక్కసారి చేసుకోవడానికి ఓపిక లేకపోవచ్చు. అలాంటప్పుడు మనందరం చేసే పని ఫుడ్ ఆర్డర్ పెట్టడం. ఫోటో పెట్టాలంటే మనకి గుర్తొచ్చేవి రెండే రెండు వెబ్సైట్స్. ఒకటి స్విగ్గీ ఇంకొకటి జొమాటో.
Video Advertisement
వీటిల్లో ప్రతి రోజు ఏదో ఒక డిస్కౌంట్ ఉంటుంది. అలాగే మెంబర్షిప్ కి తగ్గట్టు ఆఫర్స్ కూడా ఉంటాయి. ఈ ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ వల్ల ఉన్న మరొక ఉపయోగం ఏంటంటే, రోజు మొత్తంలో ఏ టైంలో అయినా ఫుడ్ ఆర్డర్ పెట్టొచ్చు.
అయితే.. ఈ ఆఫర్ల వెనుక ఉన్న మాయ గురించి చాలా మందికి తెలియదు. తక్కువ టైం లోనే ఇంట్లోంచి బయటకు వెళ్ళక్కర్లేకుండా ఫుడ్ చేతిలోకి వస్తుంది కదా అని చాలా మంది ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు. కానీ, ఈ ఆఫర్ల వెనుక ఉన్న లాజిక్ ని మిస్ అవుతున్నారు. అయితే.. ఓ కస్టమర్ మాత్రం జొమాటో చేసిన మోసాన్ని బయటపెట్టాడు. అదెలానో ఇప్పుడు చూడండి.
ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకునే కస్టమర్లు ఎక్కువ అవుతుండడంతో ఫుడ్ డెలివరీ కంపెనీలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని రెస్టారెంట్ల కంటే ఎక్కువే లాభపడుతున్నాయి. ఇటీవల రాహుల్ అనే ఓ లింక్డ్ ఇన్ యూజర్ ఈ ఫుడ్ డెలివరీ కంపెనీలు కస్టమర్ల నుంచి ఎంతమేర వసూలు చేస్తున్నాయో ప్రూఫ్స్ తో సహా చూపించాడు. ఆఫ్ లైన్ లో ఫుడ్ కొనడానికి.. ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయడానికి ఎంత తేడా ఉందొ చూపించాడు.
ఆఫ్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తే ఎంత బిల్ పడుతుంది.. అదే ఫుడ్ ని ఫుడ్ డెలివరీ యాప్స్ లో ఆర్డర్ చేస్తే ఎంత బిల్ పడుతుంది అనే వ్యత్యాసాన్ని చూపించాడు. ఈ రెండు ఆర్డర్ల ఫోటోలను లింక్డ్ ఇన్ లో పంచుకున్నాడు. దీని ప్రకారం.. వెజ్ బ్లాక్ పెప్పర్ సాస్, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, మష్రూమ్ మోమో ఆర్డర్ చేయగా.. CGST, SGSTతో కలుపుకుని ఆఫ్ లైన్ ఆర్డర్ లో రూ.512 అయ్యింది. ఇదే ఫుడ్ ని జొమాటో లో ఆర్డర్ చేయగా.. రూ.75 డిస్కౌంట్ పోనూ రూ.689.90 బిల్ పడింది. అంటే.. రూ.178 లను జొమాటో ఎక్కువ వసూలు చేసింది. ఇంత బిల్ వ్యత్యాసం ఉంటే ఎలా? అంటూ సదరు యూజర్ ప్రశ్నించారు. వెంటనే బిల్లు పెరుగుదలని నియంత్రించాలని కోరారు.
End of Article