చంద్రయాన్ 3 విజయవంతం అయ్యింది. భారత్ చరిత్ర సృష్టించింది. 2019లో చంద్రయాన్ 2 మిషన్ విఫలం అయిన తరువాత ఇండియా విజయం సాధించింది. జాబిల్లి పై ల్యాండర్ విక్రమ్ అడుగుపెట్టడంతో ప్రతి ఇండియన్ గర్వపడుతున్నాడు.
Video Advertisement
ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి, షారుఖ్ ఖాన్, ప్రభాస్, ఎన్టీఆర్ తో సహా కోట్లాది మంది సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఇస్రోకి విషెస్ తెలిపుతున్నారు. అయితే చంద్రయాన్ 3 విజయాన్ని, సలార్‌తో ప్రభాస్ అభిమానులు ముడిపెడుతూ పోస్ట్ లు చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
చంద్రయాన్ 3 సక్సెస్ అయినందుకు రెబల్ స్టార్ ప్రభాస్ తన సోషల్ మీడియా ఖాతాలో ఇస్రోను అభినందించాడు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో ప్రభాస్ ఇస్రోను ట్యాగ్ చేశాడు. దాంతో దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులలో జోష్ మొదలైంది. ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాల్లో తమ సంతోషాన్ని తెలుపుతున్నారు. అయితే ప్రభాస్ అభిమానులు అక్కడికే పరిమితం కాకుండా చంద్రయాన్ 3 మిషన్ విజయాన్ని ప్రభాస్ నటిస్తున్న సలార్ తో లింక్ చేస్తున్నారు.
చంద్రయాన్ 3 విజయం కావడం ప్రభాస్ సలార్ మూవీకి కి కలిసి వస్తుందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. దానికి కారణం ఏమిటంటే 2019 జులైలో చంద్రయాన్ 2 లాంచ్ అయ్యింది, కానీ విఫలం అయ్యింది. అదే ఏడాది ఆగస్ట్ లో రిలీజ్ అయిన సాహో మూవీ కూడా నిరాశ పరిచింది. చంద్రయాన్ 3 సక్సెస్ అయ్యింది. సలార్ కూడా ఇదే ఏడాది రిలీజ్ కానుండడంతో ఈ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి హిట్ అవుతుందని సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.
సలార్ మూవీకి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. సలార్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ మూవీ సెప్టెంబర్ లో విడుదల కానుంది. ఆదిపురుష్ వంటి డిజాస్టర్ మూవీ తర్వాత ఈ చిత్రం రిలీజ్ అవుతుండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ మూవీ భారీ విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నారు.