“ఆచార్య”లో యంగ్ చిరు పాత్రకు, మహేష్ కు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? అసలు విఎఫ్ఎక్స్ ఎందుకు వాడారంటే?

“ఆచార్య”లో యంగ్ చిరు పాత్రకు, మహేష్ కు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? అసలు విఎఫ్ఎక్స్ ఎందుకు వాడారంటే?

by Anudeep

Ads

చిరంజీవి, రామ్ చరణ్ కలిసి తెరపై కనిపిస్తే చూడాలని చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూశారు. అంతకుముందు మగధీర సినిమాలో, ఆ తర్వాత బ్రూస్ లీ సినిమాలో చిరంజీవి చిన్న పాత్రలో కనిపించారు. అలా కాకుండా వారిద్దరూ కలిసి ఒక ఫుల్ లెంత్ సినిమాలో నటించాలి అని అందరూ అనుకున్నారు. ఎట్టకేలకు వారిద్దరూ కలిసి నటించిన “ఆచార్య” సినిమా విడుదల అయినా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేదు.

Video Advertisement

విడుదల అయిన తర్వాత నుంచి సినిమాపై నెగిటివ్ టాక్ రావడం మొదలయ్యింది. సోషల్ మీడియాలో సినిమా గురించి నెగిటివ్ స్పందన వచ్చింది. కొన్ని సీన్స్ ని అయితే విపరీతంగా ట్రోల్ చేశారు. వాటిలో మెగాస్టార్ సీన్ కూడా ఒకటి.

మెగాస్టార్ చిన్న వయసులో నక్సలైట్ గా ఉన్నట్లు చూపించడానికి విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ ను వాడారు. కానీ, ఈ ఎఫెక్ట్ అంతగా నప్పలేదు. దానితో.. చిరంజీవి ఇలా చూపించాల్సిన అవసరం ఏముందని.. ఫ్యాన్స్ బాగా కోపం తెచ్చుకున్నారు. అసలు ఆచార్య సినిమాలో మెగాస్టార్ యంగ్ రోల్ కి.. మహేష్ బాబు కు ఓ లింక్ ఉంది. ఈ సినిమాను మహేష్ బాబు ఒప్పుకుంటే.. మరోలా ఉండేది ఏమో. అదెలానో ఇప్పుడు చూద్దాం.

acharya movie review

ఈ సినిమాలో సిద్ధ పాత్రకి తొలుత మహేష్ బాబుని అనుకున్నారు. పదిహేను నిమిషాల నిడివి ఉన్న పాత్ర కోసం మహేష్ బాబుకు ఏకంగా ముప్పై కోట్ల రూపాయలను ఆఫర్ చేసారు. కానీ.. మహేష్ బాబు ఈ ఆఫర్ పై స్పందించలేదు. కాకపోతే.. మెగాస్టార్ సినిమా కావడంతో “నో” చెప్పలేక సైలెంట్ గా ఉన్నారు. ఈ క్రమంలోనే సిద్ధ పాత్ర కోసం చరణ్ పేరుని ప్రతిపాదించారు మెగాస్టార్. పారితోషికాన్ని అంతే ఉంచి.. పాత్ర నిడివిని 45 నిమిషాలకు పెంచాలని సూచించారు.

దానికి తగ్గట్లే కథలో మార్పు చేర్పులు చేయాల్సి వచ్చింది. ఒకవేళ ఈ సినిమాను మహేష్ బాబు ఒప్పుకుని ఉండుంటే.. మెగాస్టార్ చిన్న వయసులో ఉన్నప్పటి రోల్ ను రామ్ చరణ్ చేత చేయించాలని దర్శక నిర్మాతలు భావించారు. కానీ.. సిద్ధ పాత్రను రామ్ చరణ్ చేయడంతో.. మెగాస్టార్ కి విఎఫ్ఎక్స్ ను వాడాల్సి వచ్చింది. అయితే మెగా అభిమానులు మాత్రం అప్ సెట్ గానే ఉన్నారు. రామ్ చరణ్ కాకపోతే.. మెగా కాంపౌండ్ లోని మరో హీరోతో చేయించాల్సిందని.. ఇలా విఎఫ్ఎక్స్ వాడడం ఎందుకు అని కామెంట్స్ చేస్తున్నారు.


End of Article

You may also like