దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్న సామెతను సెలెబ్రిటీలు అచ్చంగా పాటిస్తుంటారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూ సంపాదన వెనకేస్తూనే అడ్వర్టైజ్మెంట్స్ తో కూడా సంపాదిస్తూ ఉంటారు. ఓ వైపు సినిమా రంగంలోని సంపాదన మాత్రమే కాకుండా.. మరో వైపు వ్యాపారంలో కూడా అడుగు పెడుతూ ఉంటారు.

Video Advertisement

స్టార్ డమ్ ఉన్నంతవరకే సినిమా రంగంలో సంపాదించుకోవడం సాధ్యం అవుతుంది. అందుకే చాలా మంది స్టార్ హీరోలు వారి బ్రాండ్ కొనసాగుతున్నప్పుడే వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెడుతుంటారు.

అలా.. మహేష్ బాబు ప్రారంభించిన వ్యాపారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది రెస్టారెంట్లను ప్రారంభిస్తూ ఉంటారు. అది సహజమే. అయితే.. మహేష్ బాబు తనకంటూ సొంతంగా మల్టీప్లెక్స్ ను ప్రారంభించారు. మహేష్ బాబు కు గచ్చిబౌలిలో ఏఎంబి సినిమాస్ పేరుతో ఓ మల్టిప్లెక్స్ ఉంది. అలాగే మహేష్ బాబుకు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఉందట.

అయితే మహేష్ బాబు పేరు బయటకు రాకుండానే ఈ వ్యాపారం నడుస్తూ ఉంటుందట. ఇక మహేష్ బాబు భార్య నమ్రత కూడా దుస్తుల వ్యాపారం చేస్తూ ఉంటారట. ఇక వీరిద్దరూ ఓ మాల్ సంస్థలో స్లీపింగ్ పార్ట్ నర్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కొన్ని హాస్పిటల్స్ లో కూడా వీరికి వాటాలున్నాయట. కేవలం సినిమాలలోనే కాకుండా.. సూపర్ స్టార్ మహేష్ బాబు వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్నారు.