“పెళ్లయ్యాక ఇలానే ఉండాలి”.. అంటూ పెళ్లికూతురి కండిషన్స్.. నెట్టింట్లో వైరల్ అవుతున్న అగ్రిమెంట్!

“పెళ్లయ్యాక ఇలానే ఉండాలి”.. అంటూ పెళ్లికూతురి కండిషన్స్.. నెట్టింట్లో వైరల్ అవుతున్న అగ్రిమెంట్!

by Anudeep

Ads

పెళ్లి అనేది ఎవరి జీవితంలో అయినా ముఖ్యమైనదే. ముఖ్యంగా అమ్మాయిల జీవితంలో పెళ్లి తరువాత చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. అందుకే అమ్మాయిలు తమకి భర్తగా వచ్చే అబ్బాయి విషయంలో చాలా ఆశలు పెట్టుకుంటారు. తమకు కాబోయే భర్త ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు.

Video Advertisement

అయితే ఈ అమ్మాయి మాత్రం ఏకంగా ఓ అగ్రిమెంట్ నే రాసేసింది. తన భర్త పెళ్లి అయ్యాక ఏ పనులు చేయకూడదో.. ఏ పనులు చేయాలో ఓ అగ్రిమెంట్ రాసేసి పెళ్ళికి ముందే భర్తతో సంతకం పెట్టించేసుకుంది.

bride 1

ఇంతకీ ఆ అగ్రిమెంట్ లో ఆ అమ్మాయి ఏమి రాసిందో తెలిస్తే నవ్వకుండా ఉండలేరు.. ప్రస్తుతం ఆమె రాసిన కాంట్రాక్టు లెటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై సదరు వరుడు సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంతకీ ఈ పెళ్లి కూతురు ఏమి రాసిందో చూద్దాం. నెలకు ఒక పిజ్జా మాత్రమే తినాలట. ఇంట్లో వండి పెట్టిన ఆహారానికి మాత్రం ఎప్పుడూ ఓకే చెప్పాలట.

bride 2

ఇంట్లో రోజూ సారీ కట్టుకోవడానికి ఒప్పుకోవాలట. అలాగే.. లేట్ నైట్ పార్టీస్ తనతో మాత్రమే జరుపుకోవాలట. ప్రతి రోజు జిమ్ కి వెళ్లి వ్యాయామం చేయాలట. ప్రతి సండే ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ ని భర్తే ప్రిపేర్ చేయాలట. ప్రతి పార్టీలో ఒక మంచి ఫోటోను తీసుకోవాలట. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి షాపింగ్ కి తీసుకెళ్ళాలట. ఈ కండిషన్స్ ను చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.

 


End of Article

You may also like