ఎప్పుడూ ఏదో ఒక న్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలిచే తెలుగు సినిమా ఏదైనా ఉందంటే.. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చెప్పే పేరు ఆర్‌ఆర్‌ఆర్. ఈ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ గ్లోబల్ బాక్సాఫీస్‌ వద్ద మరోసారి తెలుగు సినిమా స్థాయి ఏంటో చాటి చెప్పింది. ఇప్పటికే గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు గెలుచుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌.. రీసెంట్‌గా ప్రతిష్టాత్మక ఆస్కార్‌ నామినేషన్స్‌ లో ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి నాటు నాటు సాంగ్‌ కూడా చోటు దక్కించుకుంది.

Video Advertisement

 

 

అయితే ఎన్నో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ అవార్డులను గెలుచుకున్న ఆర్‌ఆర్‌ఆర్ ఇప్పుడు మరో ప్రత్యేకతను సొంతం చేసుకుంది. వరల్డ్ పాపులర్ రివ్యూ సంస్థ అయినటువంటి రోటెన్ టొమేటోస్ వారు 3 గంటల కన్నా ఎక్కువ నిడివి ఉన్న ఉత్తమ వంద చిత్రాల జాబితాను తాజాగా ప్రకటించారు. అందులో ఆర్ఆర్ఆర్ చోటు సంపాదించుకుంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. అంతే కాదు ఓటీటీలోకి వచ్చాక అంతర్జాతీయంగా మంచి గుర్తింపును కూడా తెచ్చుకుంది. అలా పేరుతోపాటు పురస్కారాలు కూడా వస్తున్నాయి.

list of top 100 movies with big run time..!!

రోటెన్‌ టొమాటోస్‌ తాజాగా విడుదల చేసిన ఉత్తమ 100 చిత్రాల జాబితాలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా 12వ స్థానంలో నిలవగా, ఆమిర్‌ ఖాన్‌ – అషుతోష్‌ గోవారికర్‌ కాంబోలో వచ్చిన ‘లగాన్‌’ చిత్రం 13వ ప్లేస్‌లో ఉంది. రిచర్డ్‌ అటెన్‌బర్గ్‌ ఆస్కార్‌ విన్నింగ్‌ సినిమా అయిన ‘గాంధీ’ చిత్రానికి 32వ స్థానం దక్కింది. అనురాగ్‌ కశ్యప్‌ తెరకెక్కించిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ వసీపుర్ చిత్రం 70వ ప్లేస్‌లో నిలిచింది.

list of top 100 movies with big run time..!!

గతేడాది కూడా రోటెన్ టొమేటోస్ వారు ఆర్ఆర్ఆర్ సినిమాకు 2022 ఫ్యాన్ ఫెవరెట్ చిత్రంగా అవార్డు ప్రకటించారు. ఇక ఆర్ఆర్ఆర్ మూవీ ఇండియన్ సినిమాకు ఎంతో గర్వకారణంగా నిలిచింది అనే చెప్పాలి.అగ్ర డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ సినిమా గత ఏడాది రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ గా సంచలన విజయాన్ని నమోదు చేసింది. మన స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన భారీ మల్టీ స్టారర్ 1200 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది.ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అవుతున్న వరల్డ్ వైడ్ గా చర్చ జరుగుతూనే ఉంది.