అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ఇటీవలే మేజర్ సినిమాతో బంపర్ హిట్ అందుకున్నారు. కెరీర్ మొదట్లో కాస్త తడబడ్డా.. ఆ తర్వాత తనను తాను మార్చుకుని.. స్వయంగా తన సినిమాలను తానే రాసుకుంటూ వరుసగా హిట్‌లను అందుకుంటున్నారు. ఇక శైలేష్ కొలను దర్శకత్వంలో ఆయన హీరోగా వచ్చిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ హిట్ 2 .

Video Advertisement

హీరోగా పరిచయమైనప్పటి నుంచి విభిన్నమైన చిత్రాలను చేస్తోన్న అతడు.. ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు ‘హిట్ ద సెకెండ్ కేస్’ అనే క్రైమ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.

missed logics in hit 2 movie..!!

బద్దకస్తుడిగా పేరు తెచ్చుకున్న ఓ పోలీస్ ఆఫీసర్‌ దేశమే ఉలిక్కిపడే క్రైమ్‌ను ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంతకీ అతడు నేరస్థుడిని ఎలా పట్టుకున్నాడు? అనే కథాంశంతో రూపొందిన చిత్రమే ‘హిట్: ది సెకెండ్ కేస్’. ఈ చిత్రం మంచి పాజిటివ్ బజ్ తో దూసుకుపోతోంది.
missed logics in hit 2 movie..!!

అయితే ఈ చిత్రం లో విలన్ ని రివీల్ చేసే విషయం, అతడు హత్యలు ఎందుకు చేస్తున్నాడు అన్న విషయాలు సినిమాకు కాస్త మైనస్ గా మారాయి. అయితే ఈ సినిమాలో మేకర్స్ కొన్ని లాజిక్స్ మర్చిపోయారు అంటూ సోషల్ మీడియా లో కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రం లో కేసు ని చేధించడానికి ఉపయోగమైన క్లూ అయినా షూస్ కిల్లర్ దగ్గరికి ఎలా వెళ్లాయి..? అంతే కాకుండా వరుసగా మర్డర్స్ చేస్తున్న సైకో కిల్లర్ ఎందుకు సడన్ గా బయటపడ్డాడు..?? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

missed logics in hit 2 movie..!!

అంతే కాకుండా పోలీస్ అధికారి ఇంట్లోకి చొర‌బ‌డి `కోడిబుర్ర‌` అని రాసి వెళ్లిపోతాడు సైకో. అది చూసి హీరో షాక్ అవుతాడు. కానీ హంత‌కుడు ఎవ‌రో రివీల్ చేసినప్పుడైనా.. ఆ కోడి బుర్ర సైకో ఎవ‌రికీ తెలియ‌కుండా హీరో ఇంట్లోకి ఎలా చొర‌బ‌డ్డాడో అన్న విషయం రివీల్ చెయ్యాలి కదా.. అంటూ ఈ సినిమాలో మిస్ అయిన లాజిక్స్ గురించి నెట్టింట చర్చలు జరుగుతున్నాయి.