దశావతారాల్లో ఎనిమిదవ అవతారం అయిన శ్రీకృష్ణుడికి పురాణాల ప్రకారం 16,108 మంది భార్యలు ఉన్నారు.నిజానికి ఆయనకు ఎనిమిది మంది భార్యలు మరి ఈ 16,100 మందిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో ఇప్పుడు చూద్దాం.

దశావతారాల్లో ఒక అవతారమైన వరాహమూర్తి, భూదేవికి జన్మించిన బిడ్డ ఈ నరకాసురుడు. ఇతడు చేయని పాపం అంటూ లేదు. అతడి పాప భారం పెరిగిపోతుండటంతో అతడిని శిక్షించాలని శ్రీ మహా విష్ణువు నిర్ణయించుకున్నారు. ఈ సమయంలో భూదేవి తన బిడ్డను ఏం చేయవద్దని తను చేసే పాపాలను ఆమె భరిస్తానని మహావిష్ణువును కోరింది.దానికి సమ్మతించిన శ్రీ మహావిష్ణువు తన కుమారుడు నరకాసురుడు తన తల్లి చేతిలో తప్ప మరెవరి చేత మరణం లేకుండా వరాన్ని కోరేలా చేశాడు

అందుకే శ్రీకృష్ణుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు తన వెంట సత్యభామని తీసుకెళ్ళాడు.యుద్ధంలో నరకాసురుడు వదిలిన బాణానికి మూర్చపోయినట్లు నటించిన శ్రీకృష్ణుడు. సత్యభామ చేత నరకాసురుని వధించే విధంగా తన లీలను నడిపాడు.

ఇక నరకాసుడు ఓ కామాంధుడు అతడు 16,100 స్త్రీలను బందీలుగా చేసి వారిని రకరకాలుగా హింసించే వాడు.వారికి నరకాసురుని మరణంతో విముక్తి లభించిన వాళ్ళను ఏలుకోవడానికి ఎవరు ఒప్పుకోలేదు.దానితో వారిని కృష్ణుడు భార్యలుగా స్వీకరించి వారికి రాణుల హోదాను కల్పించారు.