మన ఇతిహాసాలు పురాణాలు నిజమని అలాగే మన సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచంలో అతి ప్రాచీనమైనవని ఎప్పటినుండో ఆస్తికులు చెబుతూ వస్తున్నారు. కానీ వీటిని నాస్తికులు ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తూ ఉండేవారు. ఇక తాజాగా భారతదేశ ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా ప్రపంచవ్యాప్తంగా కొన్ని సాక్ష్యాలు లభిస్తున్నాయి. అలాంటి వాటిలో శ్రీలంకకు భారత్ కు మధ్య ఉన్న రామసేతు కావచ్చు.

Video Advertisement

గుజరాత్ సమీపంలోని అరేబియా సీలో 150 అడుగులు లోతులో తారసపడే నగరం కావచ్చు.ఇక కృష్ణాష్టమి సందర్భంగా గతంలో గుజరాత్ రాష్ట్రంలోని జామ్ న‌గ‌ర్ వ‌ద్ద ఉన్న అరేబియా స‌ముద్రంలో దాదాపు 150 అడుగుల లోతున ఓ న‌గరం బ‌య‌ట‌ప‌డింది.

దీన్ని ప్రజలు శ్రీకృష్ణుడు ద్వారకగా పేర్కొంటున్నారు. ఇక వాటిమీద పరిశోధనలు చేసిన పరిశోధకులు కూడా గతంలో ఇది తొమ్మిది వేల ఏళ్ళ క్రితం నాటి నగరంగా పేర్కొన్నారు. తాజాగా మరోమారు కృష్ణాష్టమి సమయంలో ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి వాటి పై మీరు కూడా ఓ లుక్ వేయండి.