ఆ దేశంలో 90 శాతం ముస్లింలే…కానీ అందరు రామభక్తులే…హనుమాన్ ని విశేషంగా కొలుస్తారు.!

ఆ దేశంలో 90 శాతం ముస్లింలే…కానీ అందరు రామభక్తులే…హనుమాన్ ని విశేషంగా కొలుస్తారు.!

by Mounika Singaluri

Ads

కోట్లాదిమంది హిందువుల కల నెరవేరిన రోజు ఈ సంవత్సరం వచ్చింది.. జనవరి 22న అంగరంగ వైభవంగా శ్రీరాముని దివ్య మందిరం ప్రారంభ వేడుక జరిగింది. ఈ వేడుకల కోసం భారతదేశంలోని హిందువులే కాదు యావత్ ప్రపంచం లో ఉన్న హిందూ దేశాలు ఎదురుచూశారు. అయితే రామాయణం మూలాలు కేవలం భారత దేశంలోనే కాకుండా వేరే దేశాలతో కూడా ముడిపడి ఉంది. ఇంకా చెప్పాలంటే ముస్లిం దేశాలు కూడా రామాయణాన్ని భక్తి గ్రంథం గా గుర్తించి పారాయణం చేయడం అభినందించాల్సిన విషయం.

Video Advertisement

అలాంటి దేశాలలో ఇండోనేషియాని ప్రథమంగా చెప్పుకోవాలి. 8 నుంచి10 వరకు అనేక ఆసియా దేశాలు హిందూ రాజ్యాలుగా ఉండేవని ఆయా దేశాలలో రాముడుని దేవుడిగా కొలిచేవారు. ఇండోనేషియాలో హిందూ సంస్కృతి ప్రతి చోటా కనిపిస్తుంది. ఇక్కడ జనాభాలో 90 శాతం మంది ముస్లింలు ఉంటారు కానీ ఇప్పటికీ రామాయణం చదువుతారు రామలీలలో పాల్గొంటారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన నాలుగవ దేశం ఇండోనేషియా.

ఇక్కడ అత్యధిక జనాభా ముస్లింలదే అయినా ప్రతి ఇంట్లోనూ రామాయణం కనిపిస్తుంది. ప్రతి ముస్లిం రామాయణాన్ని చదువుతాడు. రామ్ లీలా ప్రతి నగరంలోని ప్రదర్శిస్తారు ఇందులో ముస్లింలు కూడా పాల్గొంటారు. ఈ దేశంలోని అనేక ప్రాంతాలలో రామాయణం అవశేషాలు, రామాయణ చిత్రాలను కూడా రాతి శిల్పాల్లో కనిపిస్తాయి. అయితే మన రామాయణానికి ఇండోనేషియా రామాయణానికి కొంచెం తేడా ఉంటుంది. అయోధ్య భారత దేశంలో రామనగరం అయితే ఇండియన్ ఏషియాలో యోగా పేరుతో ఉంటుంది.

రాముని కథను కాకావీన్ అంటారు. మన రామాయణాన్ని వాల్మీకి రచిస్తే ఇండోనేషియాలో దానిని కవి యోగేశ్వర్ రచించారు. ఇండోనేషియాలో నౌకాదళ కెప్టెన్ ను లక్ష్మణ్ గా వ్యవహరిస్తారు సీతను సెంటా అని పిలుస్తారు. ఇండోనేషియాలో హనుమంతుడికి అత్యంత  ప్రజాదరణ ఉంది. స్వాతంత్రం వేడుకలు జరుపుకునే డిసెంబర్ 27న యువ హనుమంతుడి వేషధారణతో రాజధాని జకార్త వీధుల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారంటే అక్కడ హనుమంతునికి ఎంత ప్రజాదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు.


End of Article

You may also like