Ads
ప్రేమ.. రెండు మనసుల కలయిక. గుండెలో దాగివున్న లక్షల భావాలను మనసులోని వారికి చెప్పేది. అది మాటలకందని ఓ మధురానుభూతి. జీవిత ప్రయాణంలో కడవరకు తోడుండేవారికి మీ మనసులో గూడుకట్టుకున్న అమితమైన ప్రేమను వ్యాకరపరచడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. వాటిలో మొదటిది.. మనసుకు హత్తుకొనేది ఏంటంటే .. ప్రేమలేఖ. ఈ స్మార్ట్ యుగం లో కూడా ప్రేమలేఖలు ఎంతో ఇంపాక్ట్ కలుగ జేస్తాయి. మనసులోని భావాలకు అక్షర రూపం ఇచ్చే ఆ లేఖలకు ఎంతో ప్రత్యేకత ఉంది.
Video Advertisement
అయితే మాములుగా మనకు ప్రేమలేఖలంటే ఆసక్తి ఎక్కువ. ఎందులో ఏం ఉంది.. ఎవరు ఎవరికి రాసారు. అని తెలుసుకోవాలి అనుకుంటాం. అదే ఒక వందేళ్లనాటి ప్రేమలేఖ అయితే అందులో ఏం ఉంటుంది. ఫోన్ లు సరిగ్గా అందుబాటు లో లేని ఆ కాలం లో ఆ లేఖ ఏం సమాచారాన్ని మోసుకెళ్ళిందో ఇప్పుడు చూద్దాం..
తాజాగా బ్రిటన్ కి చెందిన ఓ మహిళ, ఆమె కుమారుడికి ఒక వందేళ్ల క్రితం నాటి ప్రేమ లేఖ ఒకటి లభించింది. అది పగిలిపోయిన ఒక టైల్ లో ఆ లేఖ దొరికింది. ఆ లేఖ లో ఏముందో చూస్తే.. ఒక పెళ్లయిన మహిళకు ఆమె ప్రియుడు రోనాల్డ్ హాబీట్రిక్ ఆ లేఖ రాసినట్టు తెలిసింది. బ్రిటన్ కి చెందిన దాన్కిన్స్ అనే మహిళ ఇంట్లో 55 అంగుళాల స్మార్ట్ టీవీ కింద పడి పగిలిపోయింది. అయితే టీవీ కింద పడటం తో అక్కడ ఫ్లోర్ పగిలి అందులో ఈ లేఖ దొరికింది. అప్పుడు దాన్కిన్స్ కుమారుడు లూకాస్ ఆ లేఖని చూడగా ప్రస్తుతం ఆ లేఖ వైరల్ గా మారింది.
ఆ లేఖలో ” నా ప్రియాతి ప్రియతమా..ఈ ప్రేమ మనిద్దరి మధ్యనే ఉండాలి. ఎందుకంటే నీకు ఇంతకుముందే పెళ్లి అయ్యింది కదా. నన్ను రోజు కలువు అని అడగకు.. అది కొత్త సమస్యలను తెచ్చి పెడుతుంది. కానీ కలుసుకోవాలంటే ట్రామ్ కార్నర్ వద్ద అర్థరాత్రి కలుద్దాం. ఇట్లు నీ ముద్దుల ప్రియుడు రోనాల్డ్.” అని ఉంది. ఈ లేఖ 1920 కంటే ముందు రాసి ఉండొచ్చని నెటిజన్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ లేఖ రాసిన వ్యక్తి వివరాల కోసం నెటిజన్లు అన్వేషిస్తున్నారు కానీ దొరకడం లేదు. దీనిపై నెటిజన్లు పలు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ వందేళ్ల నాటి ప్రేమలేఖ అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.
source: https://youtu.be/enAA2_5lU9U
End of Article