Ads
ఇది వరకు కాలంలో ఒక జంటకు పెళ్లి చేయాలంటే ఇరు కుటుంబాల పెద్దలు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకునేవారు. ఇరు కుటుంబాల చరిత్రను తెలుసుకుని, వారి మతం, కులం, గోత్రం వంటి అన్ని వివరాలు తెలుసుకుని, అన్నీ సరిపోలితే వివాహం చేసేవారు. ప్రస్తుత కాలం లో యువత తమకి నచ్చినవారిని ఎం తెలుసుకోకుండానే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.
Video Advertisement
అయితే విదేశాల్లో ఈ కులం, మతం, గోత్రం అనేవి ఎప్పటినుంచో పట్టించుకోరు. కానీ ఏవ్ కొన్ని జంటలకు చిక్కులను తెచ్చిపెడుతున్నాయి. సరైన వివరాలు తెలుసుకోకుండా పెళ్లి చేసుకున్న ఓ జంటకు.. పదిహేడేళ్ల తర్వాత తామిద్దరూ తోబుట్టువులు అని తెలిసింది. దీంతో షాక్ అయిన ఆ జంట.. దీనికి సంబంధించిన వివరాలను సోషల్ మీడియా లో పంచుకున్నారు. దీంతో ఇప్పుడు ఈ ఘటన వైరల్ గా మారింది.
ఇంగ్లీష్ వెబ్సైట్ డైలీ స్టార్‌లో ప్రచురించిన వివరాల ప్రకారం.. అమెరికాలోని కొలరాడోలో నివసిస్తున్న సెలీనా క్వినోన్స్, జోసెఫ్ దంపతులకు పెళ్ళయ్యి పదిహేడేళ్లు అయ్యింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిద్దరూ 2006 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. వీరు వివాహానికి ముందు 4 నెలల పాటు డేటింగ్ కూడా చేశారు. అయితే ఇటీవల ఈ దంపతులు డిఎన్ఏ టెస్ట్ చేయించుకోగా వారిద్దరూ తోబుట్టువులు అని తేలింది. ఎదో సరదాగా తమ కుటుంబ చరిత్రని తెలుసుకోవాలని ఈ దంపతులు చేసిన ఈ ప్రయత్నం తో ఈ విషయం బయటపడింది.
అయితే, వీరిద్దరూ తోబుట్టువులు అయినప్పటికీ.. వారి పిల్లలలో ఎలాంటి లోపాలు లేవు. పెళ్ళికి ముందు కూడా జోసెఫ్ ని తన తల్లి కలిసి.. అతడికి తమకు దగ్గరి సంబంధాలు లేవని తెలిపినట్లు సెలీనా వెల్లడించింది. ఈ విషయాన్ని సదరు మహిళ టిక్‌టాక్‌లో షేర్ చేసింది. వీడియో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక తమ్మిద్దరి మధ్య కొత్తగా తెలిసిన ఈ బంధం మూలంగా.. తమ అద్భుతమైన కుటుంబాన్ని కోల్పోవడానికి తాము సిద్ధంగా లేమని సెలీనా తెలిపింది. ఈ ఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
End of Article