లవర్ బాయ్ తరుణ్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తెలుగులో చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారాడు. బాల నటుడిగా ఇండస్ట్రీకి వచ్చి నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకున్న తరుణ్.. ఆ తర్వాత నువ్వే కావాలి సినిమాతో హీరో అయ్యాడు. తొలి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ సాధించాడు తరుణ్. ఈ సినిమా 20 ఏళ్ళ కిందే 20 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఆ తర్వాత నువ్వే నువ్వే, నువ్వు లేక నేను లేను, ప్రియమైన నీకు లాంటి బ్లాక్ బస్టర్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి.

Video Advertisement

 

తర్వాత ఒక్కసారిగా ఫేడవుట్ అయిపోయారు తరుణ్. సినిమాలు తగ్గించడంతో పాటు కనీసం కనిపించడం మానేసాడు. ప్రస్తుతం తరుణ్ పలు వ్యాపారాలతో బిజీగా ఉన్నారు. అయితే తరుణ్ లుక్ ప్పటికీ ఇప్పటికీ మారలేదనే సంగతి తెలిసిందే. అయితే మంచి కథ దొరికితే తరుణ్ రీ ఎంట్రీ ఇస్తారని వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్- మహేష్ సినిమాలో ఒక కీలక పాత్రలో తరుణ్ చేయనున్నట్లు వార్తలు వచ్చినా.. ఈ వార్త నిజం కాదని ఆయన వెల్లడించారు.

lover boy tarun re entry to movies..??

రీఎంట్రీలో తరుణ్ సినిమాలు సక్సెస్ సాధిస్తే ఆయన మార్కెట్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. మరోవైపు ఈయన ఓ లవ్ స్టోరీతో రీ ఎంట్రీ ఇస్తున్నాడని తెలుస్తుంది. దీనికి అతడి స్నేహితుడే దర్శకుడు కావడం విశేషం. అంతేకాదు తరుణ్ ఈ సినిమాకు నిర్మాతగా మారనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటికి రానున్నాయి.

lover boy tarun re entry to movies..??

తన ఇమేజ్‌కు సరిపోయే ప్రేమ కథతోనే ఈయన రాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తరుణ్ వస్తే ప్రేక్షకులు ఎంత వరకు మెప్పిస్తారు అనేది అర్థం కావడం లేదు. మూడేళ్ల కింద ఈయన నటించిన ఇది నా లవ్ స్టోరీ కనీసం వచ్చినట్లు కూడా ప్రేక్షకులకు తెలియదు. అందుకే సినిమాలు కాదని.. పూర్తిగా బిజినెస్‌పైనే ఫోకస్ చేసాడు తరుణ్.

lover boy tarun re entry to movies..??

ఇటీవల జరిగిన నువ్వే నువ్వే రీ రిలీజ్ ఈవెంట్ లో.. మంచి కథ ఉంటే తాను సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నానని తరుణ్ చెప్పాడు. తరుణ్ ను వెండితెరపై మళ్లీ చూడాలని ఆయన అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. తరుణ్ కు యూత్ లో ఇప్పటికీ ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతే కాకుండా తరుణ్ సోషల్ మీడియాలో యాక్టివ్ కావాలని మరి కొందరు ఫాన్స్ కోరుతున్నారు.