Home News లక్ అంటే ఇతనిదేనేమో.. తృటిలో తప్పిన ప్రమాదం…..ఆనంద్ మహీంద్రాను ఆశ్చర్యపరిచిన వీడియో….

లక్ అంటే ఇతనిదేనేమో.. తృటిలో తప్పిన ప్రమాదం…..ఆనంద్ మహీంద్రాను ఆశ్చర్యపరిచిన వీడియో….

by Anudeep

నెట్ లో ఎప్పటికప్పుడు యూజర్ల లో ఆసక్తిని రేకెత్తించే విధంగా కోత తరహా పోస్టులు రెగ్యులర్ గా పోస్ట్ చేస్తు అందరినీ ఆకట్టుకునే పేరుగాంచిన పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర గారు. ఆయన ఈ మధ్య కోతగా పోస్ట్ చేసిన ఒక వీడియో నెట్ లో తెగ పాపులర్ అయి హాల్ చల్ చేస్తుంది. ఆ వీడియో ఏమిటో…అది ఎందుకంత పాపులర్ అయింది అన్న వివరాల్లోకి వెళ్తే…

Also Read:  రాఖీ పండుగ తర్వాత సోదరి కట్టిన రాఖీ ను సోదరుడు తన చేతి నుండి ఎప్పుడు తీసివేయాలి?

Watch video of Man's Narrow Escape On Sidewalk Leaves Anand Mahindra Stunned

 

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఒక వ్యక్తి మనకు రోడ్డు దాటుతు కనిపిస్తాడు. అందులో పెద్ద వింతేముంది అనుకుంటారేమో…. అసలు కథ అంతా ఆ తర్వాతే ఉంది. సాధారణంగా నడుస్తూ వెళ్లిన అతను రోడ్డు పక్కన ఉన్న షాప్ దగ్గరకు వెళ్ళాడు. ఇంతలో సడన్ గా అతను అడుగు తీసి అడుగు వేసే టైంలో కాళ్ళ కింద ఉన్న నేల కుప్పకూలి ఒక్కసారి పక్కనే ఉన్న డ్రైనేజ్ లో పడి పోయింది.
అయ్యో మరి అతను కూడా డ్రైనేజ్ లో పడిపోయాడు అని అనుకుంటున్నారా అయితే మీరు పప్పులో కాలేసినటే. ఆల్మోస్ట్ అతను కూడా డ్రైనేజ్ లో పడిపోయాడు అనుకునే టైంలో ఒక్క అంగలో తృటిలో ప్రమాదం తప్పించుకొని సైడ్ కు వెళ్లి పడ్డాడు. వెంట్రుక వాసిలో అంటారు చూడండి అలా తప్పించుకున్నాడు.

Also Read: 24 ఏళ్ల కొడుక్కి..42 ఏళ్ల తల్లికి ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగం..! రియల్ స్టోరీ.!!

 

“ఇదిలా ఉండగా ఇంత లక్కీ ఫెలోకి ప్రపంచం ఎలాంటి మెసేజ్ పంపిస్తుందో తెలుసుకోవాలి అని ఆలోచనతో నేను ఈ వీకెండ్ గడపబోతున్నాను. ఒకవేళ మీరు అతని స్థానంలో ఉంటే ఏం ఆలోచిస్తారు” ఈ వీడియో పై మీ వ్యూస్ కామెంట్స్ లో తెలపండి అంటూ మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా నెటిజన్స్ ను కోరారు. 30 సెకండ్ల లెంగ్త్ లో ఉన్న ఈ వీడియో సంఘటన జరిగిన ప్రదేశంలోని షాప్ సీసీటీవీ ఫుటేజ్ నుంచి సేకరించబడింది.

ఈ వీడియో చూసి చాలా మంది స్పందించారు. అందులో ఒకతను “ఒక సెకను కూడా ఆలస్యం చేయవద్దు” అంటూ అని సూచించగా, “మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి సిటిజన్స్ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకురావాలని మరొక యూజర్ కామెంట్ చేశారు. అని కామెంట్ చేశారు. ఈ వీడియో ట్విట్టర్ లో రిలీజ్ అయిన క్షణం నుంచి ఇప్పటివరకు 25 వేలకు పైగా లైకుల ,2500 రిట్విట్లు సంపాదించింది.

Also Read:  బాలయ్యకి చెల్లెలి పాత్ర ఇచ్చారని కన్నీరు పెట్టుకున్న నటి లయ.. ఎందుకో తెలుసా??

You may also like