Ads
ప్రపంచ కుబేరుల స్థానం లో చోటు దక్కించుకున్న ముఖేష్ అంబానీ గురించి తెలియని వారు ఉండరు. లక్షల కోట్ల రిలయన్స్ ఇండస్ట్రీస్ సామ్రాజ్యానికి అధిపతి.. ఆయన వ్యాపారాలు దేశంలోని ప్రతి మూల నుంచి విదేశాలకు విస్తరించాయి. తండ్రి మరణాంతరం ఆయిల్, పెట్రోకెమికల్స్ వ్యాపారాలను అన్న ముఖేష్ అంబానీ ఎంచుకుంటే.. పవర్, టెలికామ్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను తమ్ముడు అనిల్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఆసియాలోనే అపర కుబేరుడు అయ్యాడు ముఖేష్ అంబానీ.
Video Advertisement
ముఖేష్ అంబానీ గత 12 ఏళ్ల కాలంలో రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియో వంటి కొత్త కొత్త వెంచర్లతో దూసుకెళ్లారు.ఆయిల్ అండ్ గ్యాస్ బిజినెస్‌ను మరింత విస్తరించారు. దూరదృష్టి, పట్టుదల అనే అంశాలు ముఖేష్ అంబానీని ఏ వ్యాపారంలోనైనా లీడర్‌గా నిలిపాయి. ఆర్‌కామ్ ప్రారంభమైన దాదాపు 14 ఏళ్ల తర్వాత మళ్లీ రిలయన్స్ జియోను ఏర్పాటు చేశారు ముకేశ్ అంబానీ. దీన్ని కేవలం మూడేళ్ల కాలంలోనే టాప్ 3 టెలికం సంస్థల్లో ఒకటిగా నిలిపారు. ఇప్పుడు అంబానీ దగ్గరున్న ఖరీదైన వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం..
#1 ఆంటిలియా
ముఖేష్ అంబానీ ఇంటి పేరు ఆంటిలియా. ఆంటిలియా భారతదేశంలోని అతి ఖరీదైన ప్రాపర్టీ. ఆంటిలియాను చికాగోకు చెందిన ఆర్కిటెక్ట్స్ పెర్కిన్స్ మరియు విల్ రూపొందించారు. ఇందులో 27 అంతస్థులు ఉంటాయి.ఆంటిలియాలో సెలూన్, థియేటర్, స్విమ్మింగ్ పూల్, జిమ్, ఐస్ క్రీమ్ పార్లర్ ఇంకా ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. ఆంటిలియా ఖరీదు 12,000 కోట్లు.
#2 స్టోక్ పార్క్
2021 లో ముఖేష్ అంబానీ స్టోక్ పార్క్ అనే బ్రిటిష్ ఎస్టేట్ ని కొనుగోలు చేసారు. 300 వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న దీని విలువ 79 మిలియన్ డాలర్లు. అది లండన్ కి 40 కిలోమీటర్ల దూరం లో ఉంది.
#3 బోయింగ్ బిజినెస్ జెట్ 2
ముఖేష్ అంబానీ కి బోయింగ్ బిజినెస్ జెట్ 2 ఉంది. దీని విలువ 73 మిలియన్ డాలర్లు.
#4 ఎయిర్ బస్ ఏ 319
2007 లో నీతా అంబానీ పుట్టిన రోజు సందర్భంగా ముకేశ్ ఈ ఎయిర్ బస్ ని ఆమెకి గిఫ్ట్ ఇచ్చారు. దీని విలువ 240 కోట్ల రూపాయలు. గాలిలో ఎగిరే ఒక ఫైవ్ స్టార్ హోటల్ లాంటిది ఈ ఎయిర్ బస్ ఏ 319 . ఇందులో 18 మంది ఒకేసారి ప్రయాణించే వీలుంది.
#5 ఫాల్కన్ 900 ఈఎక్స్
ముఖేష్ అంబానీ కి ఫాల్కన్ 900 ఈఎక్స్ ప్రైవేట్ జెట్. ఇందులో పర్సనల్ సాటిలైట్, మ్యూజిక్ సిస్టమ్స్, వైర్లెస్ కమ్యూనికేషన్స్ ఉన్నాయి. దీని విలువ 33 కోట్లు.
#6 రోల్స్ రాయిస్ కల్లినన్
ముఖేష్ అంబానీ దగ్గర దాదాపు రూ.13 కోట్ల ఖరీదు చేసే రోల్స్ రాయిస్ కల్లినన్ ఉంది.
#7 మెర్సిడెజ్ మేబ్యాక్ బెంజ్ S660
ముఖేష్ అంబానీ వద్ద మెర్సిడెజ్ మేబ్యాక్ బెంజ్ ఎస్660 గార్డ్ కూడా ఉంది. దీని విలువ రూ. 10 కోట్ల కంటే ఎక్కువ.
#8 BMW 760 LI
ముఖేష్ అంబానీకి బుల్లెట్ ప్రూఫ్ కార్లు కూడా ఉన్నాయి. అతనికి BMW 760Li సెక్యూరిటీ (ఆర్మర్డ్) ఉంది. దీని ధర రూ.8.50 కోట్లు.
#9 ఫెరారీ SF90 స్ట్రాడేల్
ముఖేష్ అంబానీ వద్ద ఫెరారీ SF90 స్ట్రాడేల్ కూడా ఉంది. ఇది హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు. దీని ఖరీదు దాదాపు రూ.7.50 కోట్లు.
#10 జపాన్ కి చెందిన పురాతన టీ సెట్
నీతా అంబానీ టీ తాగడం తో ఆమె దిన చర్యను ప్రారంభిస్తారు. ఆమె టీ తాగే కప్పు మూడు లక్షల రూపాయలు. ఈ కప్పులను జపాన్ నుంచి దిగుమతి చేసుకున్నారట. వీటి పై బంగారు పూత తో ప్రత్యేకం గా డిజైన్ చేశారట. ఒక కప్పు విలువ మూడున్నర లక్షలట. మొత్తం సెట్ విలువ కోటిన్నర పైమాటే ఉంటుందట.
#11 పామ్ జ్యూమైరా మేనర్
దుబాయ్‌లో సూపర్ రిచ్ ప్రాంతమైన పామ్ జుమేరా ద్వీపంలో ఒక అధునాతన, అత్యంత విలాసవంతమైన విల్లాను ముఖేష్ అంబానీ కొన్నారు. దీని విలువ దాదాపు రూ. 1,350 కోట్లు. బీచ్ ఫేసింగ్ లో ఉన్న ఈ విల్లా లో 10 బెడ్ రూమ్‌లు, 18 బాత్‌రూమ్‌లు, ప్రైవేట్ స్పా, ఇండోర్ & అవుట్‌డోర్ స్విమ్మింగ్ పూల్స్, జిమ్ ఉన్నాయి. అలాగే ఆ విల్లా బేస్‌మెంట్‌లో 15 కార్లను పార్క్ చేసుకోవచ్చట.
#12 హామ్లెయ్స్
2019 లో అంబానీ 259 ఏళ్ళ చరిత్ర కలిగిన టాయ్ స్టోర్ ని కొనుగోలు చేసారు. ఆ సంస్థ 1760 లో ప్రారంభమైంది. దీనిని 620 కోట్ల తో కొనుగోలు చేసారు.
#13 ముంబై ఇండియన్స్
2008 లో ప్రారంభమైన ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్ 5 ఐపీయల్ టైటిల్స్ గెలుచుకుంది. దీని విలువ 87 మిలియన్ డాలర్లు (722 కోట్లు)
End of Article