100 ఏళ్ల క్రితం స్పానిష్ ప్లూ ని… ఇప్పుడు కరోనాని జయించిన 107 ఏళ్ల బామ్మ

100 ఏళ్ల క్రితం స్పానిష్ ప్లూ ని… ఇప్పుడు కరోనాని జయించిన 107 ఏళ్ల బామ్మ

by Anudeep

Ads

“గట్టిపిండం” అనే మాట మీరు వినే ఉంటారు కదా… ఈ బామ్మని చూస్తే నిజమే అనుకుంటారు. ప్రతి వందేళ్లకొకసారి ఏదో ఒక వైరస్ ప్రపంచాన్ని భయపెడుతూనే ఉంది అని ఇంతకుముందొకసారి చెప్పుకున్నాం..ఈ మద్య ఆయా ఉత్పాతాల గురించి చర్చ కూడా జరిగింది.. మరైతే వందేళ్లక్రితం వచ్చిన స్పానీష్ ప్లూ బారిన పడి బతికి బట్టకట్టి, ప్రస్తుత ప్రపంచాన్ని చూస్తున్నవారెవరైనా ఉన్నారా అంటే.. లేకేం, అప్పుడు స్పానీష్ ప్లూ ఇప్పుడ కరోనా బారిన పడి బతికి బట్టకట్టింది ఈ బామ్మా.. ఆమె గురించి తెలుసుకోవాలంటే చదవాల్సిందే..

Video Advertisement

1918లో స్పానిష్ ఫ్లూ విజృంభించి ప్రపంచాన్ని భయెపెట్టింది..ప్రపంచ వ్యాప్తంగా 50మిలియన్ల  జనాబా ప్లూ బారిన పడి మరణించారు. అప్పుడు మారిలీ షఫిరో ఏషెర్ వయసు ఆరేళ్లు.. ప్రస్తుతం 107 ఏళ్లు.. అప్పుడు స్పానిష్ ప్లూ బారిన పడి బయటపడింది,ఇప్పుడు కరోనాని ఎదిరించింది మారిలీ.1912  చికాగోలో పుట్టి,పెరిగిన మారిలి , యుక్త వయసులో ఉండగానే ఆర్టిస్టుగా జీవనాన్ని ప్రారంభించింది..ఇప్పటికి ఆర్టిస్టుగానే కొనసాగుతుంది. 1943లో బెర్నార్డ్ షపిరోను వివాహం చేసుకుంది. ముప్పై ఐదేళ్ల వయసులో అంటే 1947లో సోలో ఎగ్జిబిషన్ నిర్వహించింది. మారిలి 80ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడే 1974లో భర్త బెర్నార్డ్ చనిపోయారు.తర్వాత  చిన్ననాటి స్నేహితుడు రాబర్ట్ ను రెండో వివాహం చేసుకుంది, అతడు కూడా 2008లో మరణించాడు. ఆరేళ్లకి స్పానిష్ ప్లూ, ఇప్పుడు కరోనా ఈ రెండింటిని నెగ్గిన మారలి గురించి క్లుప్తంగా తన గురించి పరిచయం…

ప్రస్తుతం కరోనా నుండి కోలుకుని ఇంటికొచ్చిన తన తల్లి గురించి కూతురు షఫిరో మాట్లాడిన మాటలు తన మాటల్లోనే.. “ఏప్రిల్ నెల మధ్యలో ఒక డాక్టర్ ఫోన్ చేశారు, మీ తల్లి 12గంటలు మాత్రమే బతుకుతుందని చెప్పారు. నా తల్లి ఈయనకెలా తెలుసు అని ఆలోచన వచ్చింది, కాని తను ఒక ఆర్టిస్ట్ తెలియకుండా ఎలా ఉంటుంది..తను నమ్ముకున్న కళను బతికించడానికే మళ్లీ మా అమ్మ బతికిందనుకుంటా..ఎనభై ఏళ్లుగా మా అమ్మ కళే శ్వాసగా బతికింది, ఇప్పుడు కరోనా మా అమ్మను మాకు దూరం చేస్తుందనుకున్నాం, డాక్టర్స్ చెప్పింది వింటే అదే జరుగుతుందనిపించింది. కాని మా అమ్మ కరోనాని జయించింది అంటూ చెప్పుకొచ్చింది.

జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న మారిలి శతాబ్దం తర్వాత కరోనా బారిన పడింది.. సీనియర్ సిటిజన్స్ ని, చిన్నపిల్లలని మాత్రమే టార్గెట్ చేస్తున్న కరోనా వైరస్ బారిన పడిన మారిలి 5రోజుల ట్రీట్మెంట్ తర్వాత ఆరోగ్యంగా ఇంటికి చేరింది..కనీసం వెంటిలేటర్ అవసరం లేకుండానే తను కరోనాని జయించింది..రియల్లీ గ్రేట్..


End of Article

You may also like