సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు చిత్రం సూపర్ హిట్ అయిన విషయం, తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం సిద్ధూ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం లో నేహా శెట్టి హీరోయిన్ గా నటించారు.

Video Advertisement

అయితే ఈ చిత్రానికి సీక్వెల్ రానున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీలను మొదట హీరోయిన్ గా అనుకున్నారు. తర్వాత అనుపమ పరమేశ్వరన్ పేరు వినిపించింది. అంతేకాదు ఓ వారం రోజులు షూటింగ్ కూడా చేసింది అనుపమ. అయితే కొన్ని అభిప్రాయ బేధాలతో ఆమె తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్లేస్ లో ఆమె స్థానంలో మరో మలయాళీ అందం మడోన్నా సెబాస్టియన్ వచ్చి చేరింది.

madonna sebastian replaces anupama in DJ tillu square..

ఇప్పటికే ఈ చిత్రానికి తాను డైరెక్ట్ చేయడం లేదని దర్శకుడు విమల్ కృష్ణ ప్రకటించాడు. డీజే టిల్లు సినిమాకు సంగీతం అందించిన శ్రీచరణ్ పాకాలను తప్పించి మ్యూజిక్ బాధ్యతలను రామ్ మిర్యాలకు కట్టబెట్టారు. ఇప్పుడు ఇలా హీరోయిన్ల మార్పులు జరుగుతున్నాయి. డీజే టిల్లు స్క్వేర్ అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాలో ఇంకా ఎలాంటి మార్పులు జరుగుతాయా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

madonna sebastian replaces anupama in DJ tillu square..

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేస్తోన్న ఈ డీజే టిల్లు సీక్వెల్‌ను సితార ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కూడా హీరో సిద్ధునే స్క్రిప్ట్, డైలాగ్స్ రాశారట.