Ads
ఒక సినిమా సక్సెస్ కు, ఫెయిల్యూర్ కు దర్శక నిర్మాతల కన్నా నటుడి కన్నా ఎక్కువ బాధపడేది ఆ హీరో అభిమానులు మాత్రమే. తమ అభిమాన హీరోల సినిమాలు సక్సెస్ అయినప్పుడు కట్ అవుట్ లు పెట్టి భారీ ఎత్తున ప్రదర్శనలు చేసే వీరు పొరపాటున ఆ సినిమాలు ఫ్లాప్ అయితే మాత్రం అసలు తట్టుకో లేరు.
Video Advertisement
ఈ క్రమంలో తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు రీసెంట్ గా వస్తున్న ఆయన సినిమాల గురించి తమ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణ తనయుడుగా బాల నటుడుగా తెలుగు తెరకు పరిచయమైన మహేష్ బాబు, టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎదిగి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. తన లుక్స్ తో , యాక్షన్ తో ఎంతోమంది ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందిన హీరో మహేష్ బాబు.
బాల నటుడిగా తన నటనతో అందరినీ మెపించిన మహేష్ రాకుమారుడు చిత్రంతో హీరో గా ఎంట్రీ ఇచ్చారు. యువరాజు, వంశీ, మురారి, పోకిరి, అర్జున్,ఆగడు,దూకుడు లాంటి చిత్రాలు వినూత్నమైన కథతో మహేష్ బాబును తిరుగులేని తారగా నిలబెట్టాయి. గతంలో మహేష్ సినిమాలు అన్ని మంచి క్రేజ్ తో పాటు మంచి సక్సెస్ ను అందుకున్నాయి.కానీ ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద వసూళ్లు చేస్తున్న ప్రేక్షకులను మాత్రం నిరాశకు గురి చేస్తున్నాయి. ఈ మధ్య మహేష్ బాబు చిత్రాలు అన్నిటికీ ఒకే రకమైన థీమ్ ఉండడంతో అవి అభిమానులు ఆశించినంత కిక్ ఇవ్వలేక పోతున్నాయి.
దీంతో మొన్న మహేష్ బాబు జన్మదినం సందర్భంగా చాలా థియాటర్ లలో ఆయన నటించిన పాత సినిమాలు ప్రదర్శించిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో లో ఒక ఫ్యాన్ ” ఇప్పుడు మీరు చేస్తున్న సినిమాలు చూడలేకే మళ్లీ పాతవి రిపీట్ చేస్తున్నాము. ఇప్పటికైనా తెలుసుకో మావయ్య” అంటూ తన ఆవేదనని ట్విట్టర్ వేదిక గా మొరపెట్టుకున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలతో బిజీగా ఉన్న ఈ సూపర్ స్టార్ అభిమానుల మొర విని ఇక్కనైన తన రేంజ్ కి తగ బ్లాక్బస్టర్ తో కనుల విందు చేస్తాడు అని ఆశిద్దాం.
End of Article