మహేష్ బాబు ఒకవైపు సినిమాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో.. తన కుటుంబానికి అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఒక రకంగా చెప్పాలంటే మహేష్ బాబు అసలు సిసలు ఫ్యామిలీ మ్యాన్ అనే చెప్పాలి. సినిమాలతో పాటు ఫ్యామిలీ కి ఖచ్చితంగా టైం కేటాయిస్తారు. సినిమా సినిమాకి మధ్య ఖచ్చితం గా ఫ్యామిలీ తో విదేశాల్లో పర్యటనలకు వెళ్తారు మహేష్. టాలీవుడ్ లోని క్యూట్ కపుల్ లో మహేష్, నమ్రత ముందుంటారు.

Video Advertisement

ఇటీవలే వీరి పెళ్లి జ‌రిగిన 18 ఏళ్లు అయిన సంద‌ర్భంగా వారిద్ద‌రూ ఒక‌రికొక‌రు సోష‌ల్ మీడియా ద్వారా అభినంద‌న‌లు తెలియ‌జేసుకుంటూ ఎమోష‌నల్ పోస్టుల‌ను పెట్టారు మహేష్, నమ్రత. వీరిద్దరిది ఎంతో అన్యోన్యమైన జంట. వీరిద్దరిని మహేష్ అభిమానులు ఆదర్శంగా తీసుకుంటారు. పెళ్ళికి ముందు సినిమాల్లో నటించిన నమ్రత.. పెళ్లి తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. కుటుంబాన్ని, పిల్లలను చూసుకుంటూ ఉండిపోయారు. మహేష్ బిజినెస్ వ్యవహారాలన్నిటిని నమ్రతే చూసుకుంటారు.

mahesh fans fire on umair sandhu on spreading rumours about mahesh..

మహేష్ కెరీర్ లో అతడి పై వచ్చిన రూమర్స్ కూడా తక్కువే. అంత క్లీన్ ఇమేజ్ మైంటైన్ చేస్తారు మహేష్. అయితే తాజాగా మహేష్.. ఇంకొక హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడంటూ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నాడు ఒక క్రిటిక్. దుబాయ్ లో ఉండే ప్రముఖ రివ్యూయర్, క్రిటిక్ అయిన ఉమైర్ సంధూ మహేష్ కి, పూజ హెగ్డే తో ఎఫైర్ ఉందంటూ ట్వీట్ చేసాడు. ఉమైర్ సంధూ నిత్యం పలు సినిమాలపై, సెలబ్రెటీల పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు పెడుతూ ఉంటాడు.

mahesh fans fire on umair sandhu on spreading rumours about mahesh..

అయితే ఇప్పుడు ఏకంగా మహేష్ గురించి ఇటువంటి ట్వీట్ చేయడం తో మహేష్ ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోటికి ఎలా వస్తే అలా మాట్లాడుతున్నాడు అంటూ ఫైర్ అవుతున్నారు. ఇంతకు ముందు కూడా చిరంజీవి గురించి, ప్రభాస్ గురించి కూడా కామెంట్స్ చేసాడు ఉమైర్.

mahesh babu fans fire on umair sandhu

అంతే కాకుండా పలు తెలుగు చిత్రాలు విడుదల కాక ముందే రివ్యూ లు ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కే సినిమాలకు నెగిటివ్ రివ్యూలు ఇస్తూ ఆ సినిమాల బిజినెస్ కు ఉమైర్ సంధు తీవ్ర స్థాయిలో నష్టం చేస్తున్నారు అంటూ తెలుగు ప్రేక్షకులు అతడి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.