పరశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన బోలెడు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Video Advertisement

అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ మూవీ కోసం అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. షూటింగ్ ఆలస్యం కావడం వల్ల వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. అయితే ఈ సినిమాకి లీకుల బెడద తప్పట్లేదు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట లీక్ అవ్వగా.. తాజాగా ఈ సినిమా నుంచి ఒక డైలాగ్ లీక్ అయ్యింది.

SSMB 28 leacked dialogue

ఈ మూవీ లో మహేష్ బాబు పాత్రపేరు అల్లూరి రాధాకృష్ణ అని తెలుస్తోంది. అలాగే ఆయన ఒక మిర్చి మిల్లు ఓనర్ గా ఈ చిత్రం లో కనిపించనున్నట్లు సమాచారం. అలాగే ఈ మూవీ నుంచి ” మిర్చి ఘాటుకి, రాధా గాడి పోటుకి తిరుగేలేదు..” అన్న డైలాగ్ ఒకటి వైరల్ గా మారింది. ఇక మహేష్ పాత్ర మాస్ ఆడియన్స్ ని అలరించేలా ఉంటుందని తెలుస్తోంది.

SSMB 28 leacked dialogue

ఈ మూవీ లో జగపతిబాబు విలన్ గా నటిస్తుండగా పూజా హెగ్డే , శ్రీలీల హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర రాధాకృష్ణ (చిన‌బాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త‌మ‌న్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం కోసం మహేష్ తన లుక్‌ని పూర్తిగా మార్చుకున్నారు. సిక్స్ ప్యాక్ లుక్‌లో కనిపించబోతున్నారు మహేష్.

SSMB 28 leacked dialogue

దీని త‌ర్వాత మ‌హేష్ బాబు త‌న 29వ చిత్రాన్ని ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. జక్కన్న దీన్ని పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.