రియల్ లైఫ్ కపుల్ నాగ చైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం ‘మజిలీ’. ఈ సినిమాకి ముందు వారిద్దరూ కలిసి రెండు చిత్రాల్లో నటించారు కానీ నిజ జీవితం లో భార్యాభర్తలు అయిన తర్వాత ఈ చిత్రం లో వారు తొలి భార్యాభర్తలుగా కలిసి నటించారు. కానీ వారికి జంటగా అదే సినిమా ఆఖరిది అయ్యింది. అయితే ఈ చిత్రం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. మజిలీ సినిమాలో సమంత నటనకు ఎన్ని మార్కులు వేసినా తక్కువే. భర్త యొక్క ప్రేమను పొందేందుకు ఆమె చేసే ప్రయత్నం.. ఆమె ఎమోషన్స్ లో చూడవచ్చు.

Video Advertisement

అయితే ఈ చిత్రాన్ని మరాఠీ లో రీమేక్ చేయనున్నారు. నిజజీవిత జంట అయిన రితేష్, జెనీలియా ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేసారు. దాన్ని చూసిన నెటిజన్లు రీమేక్ లో జెనీలియా అనుకున్న స్థాయిలో ఎమోషన్స్ పండించలేక పోయిందని అనుకుంటున్నారు.

majili movie soul missed in marathi remake..

మజిలీ చిత్రం లో సమంత ఒక సన్నివేశంలో నాగ చైతన్య కాలు టచ్ చేస్తుంది. ఆ సన్నివేశంలో సమంతకు అతడిపై ఉన్న ప్రేమ మొత్తం కనిపిస్తుంది. ఆ సన్నివేశంను ఏ ఒక్కరు కూడా ఓవర్ అనుకోలేదు. కానీ తాజా ఈ సినిమా లో మాత్రం రితేష్ యొక్క కాలును టచ్ చేసి మొక్కుకున్న సమయంలో జెనీలియా ఓవర్ యాక్షన్ అనిపించింది. ఈ ఒక్క సీన్ తోనే మజిలీ రీమేక్ నిరాశ పర్చింది.

majili movie soul missed in marathi remake..

జెనీలియా చాలా సీనియర్ హీరోయిన్. నటిగా మంచి మార్కులు దక్కించుకుంది. తెలుగులో ఆమెకు ఇప్పటికీ అభిమానులున్నారు. కానీ మజిలీ చూసిన తర్వాత సామ్ పాత్రలో జెనీలియా సరిపడలేదని వారు భావిస్తున్నారు. అంతే కాకుండా మజిలీ సినిమాలో “ప్రియతమా” సాంగ్ చాలా బావుంటుంది. కానీ ఈ సాంగ్ లో మ్యూజిక్ ఆ సిట్యుయేషన్స్ కి సరిపడినట్టు లేదని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేసి సినిమా మరెంత కళా ఖండం అన్నట్లుగా ఉంటుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

2012లో రితేష్‌ తో పెళ్లి తర్వాత దాదాపు పదేళ్ల కు జెనీలియా మళ్లీ వెండితెరపై కనిపించబోతుంది. ‘వేద్‌’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుంది. మరాఠీలో జెనీలియా హీరోయిన్ గా చేస్తున్న మొదటి సినిమా ఇది. ఈ సినిమాని ఆమె భర్త రితేష్‌ దర్శకత్వం వహించడం విశేషం. దర్శకుడిగా రితేష్‌కి కూడా ఇది తొలి సినిమా కావడంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.

watch video :