సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక జంటగా వచ్చిన పాన్ ఇండియన్ సినిమా ‘పుష్ప’ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అల్లు అర్జున్ సినిమా తెలుగు, మలయాళంలోనే హిట్ అవుతుందనుకుంటే, మొత్తం దేశాన్నే షేక్‌ చేసింది ఈ సినిమా. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమా రెండవ భాగమైన “పుష్ప: ది రూల్” పైన అంచనాలు రోజు రోజుకీ పెరుగుతూ వస్తున్నాయి.

Video Advertisement

 

 

‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్‌ను కొత్తగా ఆవిష్కరించడమే కాదు.. ఆ చిత్రంలో చాలా సన్నివేశాలను ఇది వరకు ప్రేక్షకులు చూడని విధంగా చూపించారు దర్శకుడు సుకుమార్. అందుకే, దేశ వ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంది. అయితే ‘పుష్ప: ది రూల్’ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రెండో పార్ట్ తో వెయ్యి కోట్లు కలెక్ట్ చెయ్యాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక అప్డేట్ వైరల్ గా మారింది.

makers planing to go to oscars for pushpa 2..!!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ కి ఒక అడుగు దూరం లో నిలిచింది. ఈ చిత్రం ఆస్కార్ అవార్డు గెలవాలని దేశం మొత్తం ఎదురుచూస్తోంది. అయితే ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ వస్తే పుష్ప2 కు కూడా ఆస్కార్ కోసం భారీ స్థాయిలో ఖర్చు చేయనున్నారని సమాచారం అందుతోంది. పుష్ప 2 సినిమా ప్రారంభం కాస్త ఆలస్యమైనా, రిలీజ్ విషయంలో మూవీ యూనిట్ పక్కాగా ప్రణాళికలు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. వరల్డ్ వైడ్ గా ఒకేసారి పుష్ప2 ను ఆడియెన్స్ ముందుకు తేవాలనే ఇప్పటి నుండే ప్రణాళికలు వేస్తున్నారు. ఇరవైకి పైగా దేశాల్లో ఈ మూవీని ఒకేసారి విడుదల చేయాలనే లక్ష్యంతో పని చేస్తోంది మైత్రీ టీమ్‌ అండ్‌ సుకుమార్‌ టీమ్‌.

makers planing to go to oscars for pushpa 2..!!

ఇక దీని కోసం ఇంటర్నేషనల్ ప్రమాణాలతో మూవీను రూపొందించడంతో పాటు, వివిధ భాషల్లో కూడా విడుదల చేయాలని చూస్తున్నారు. దీనితో పాటుగా తొలి పార్టు సినిమా చివరి సమయంలో కంగారు పడిన ఎక్స్పీరియన్స్ ని దృష్టిలో ఉంచుకుని, మళ్ళీ అలాంటివి రాకుండా విడుదల తేదీ ప్రకటించాలని అనుకుంటున్నారట మేకర్స్. ఇక పుష్ప: ది రైజ్ మూవీ సైమా అవార్డ్స్ వేడుకలో పుష్ప 6 కేటగిరీస్ లో అవార్డ్స్ గెలుచుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు.