కరోనా మహమ్మారి దేశమంతా విజృంభిస్తూ ఉంది. దీనితో దేశమే కాదు ప్రపంచం మొత్తం స్తంభించింది. ఆర్ధిక వ్యవస్థను భారీగా దెబ్బ తీసింది అంతే కాదు సినిమా షూటింగ్స్ లు, సినిమా హాల్ లు కూడా మూత పడ్డాయి. కానీ మలయాళ బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం గుట్టు చప్పుడు కాకుండా చెన్నై లోని ఒక సెట్ లో రహస్యంగా చిత్రీ కరిస్తున్న సంగతి తెలుసుకున్న పోలీసులు సరా సరి సెట్ కి వెళ్లి సీజ్ చేసారు.

Video Advertisement

Also Read : “సూపర్ మారియో” గేమ్ మన “బ్రహ్మి వెర్షన్” లో ఎంత ఫన్నీగా ఉందో చూడండి.! (VIDEO)

అంతే కాదు నిర్వాహకుల మీద కేసు సైతం నమోదు చేసారు ఆర్డీవో ప్రీతి పర్కావి షూటింగ్ జరుపుకుంటున్న ఈవీపీ ఫిల్మ్‌సిటీకి పోలీసులతో వెళ్లి షూటింగ్ అడ్డుకున్నారు.హౌస్ మేట్స్ ని హోటల్ కు పంపించేసి సెట్ ని సీల్ చేసారు.ఇకపోతే మలయాళ బిగ్ బాస్ కు మోహన్ లాల్ గారు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.లాక్ డౌన్ వేళలో వ్యాపార సంస్థలు అన్ని మూత పడినప్పటికీ షూటింగ్ మాత్రం జరపటం పట్ల తీవ్ర విమర్శలు చేస్తున్నారు నెటిజన్స్.

Aslo read : ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్: భీం న్యూ లుక్ చూడండి..అదిరిందిగా..!