Ads
పెళ్లి చేసుకునే ముందు కచ్చితంగా వరుడు వధువు కొన్ని విషయాలను చూసుకుంటూ ఉంటారు. ఇలా నచ్చిన వ్యక్తిని ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అయితే ప్రతి ఒక్కరికి పెళ్లి అనేది చాలా ప్రత్యేకమైనది. ఈ బంధంలోకి వెళ్లే ముందు ఎన్నో అనుమానాలు.. భయాలు.. సందేహాలు వస్తూ ఉంటాయి.
Video Advertisement
అయితే కొన్ని సార్లు మనసులోని ప్రశ్నని ఎవరిని అడగాలో అర్థం కాదు. అలా మా దగ్గరికి ఒక ప్రశ్న వచ్చింది. ఒక ఇంద్రకి పెద్దలు చూసిన అమ్మాయితో నిశ్చితార్థం అయ్యింది. ఆమె ఒక మల్టి నేషనల్ కంపెనీ లో మంచి పోసిషన్ లో ఉంది. అయితే “పెళ్లి అయిన తర్వాత ఆమెను ఉద్యోగానికి పంపాలా వద్దా అని సంశయం లో ఉన్నాను. నాకు తెలిసిన వారిని అడిగితే అటువంటి సంస్థల్లో సహోద్యోగులతో సన్నిహిత సంబంధాలు పెరిగేందుకు అవకాశం ఉంది అని చెప్పారు. నాకు ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు.” అనే ప్రశ్న వచ్చింది.
నాకు ముందు చాలా ఆశ్చర్యం గా అనిపించింది. అంత చదువుకున్న వ్యక్తి కూడా తన జీవిత భాగస్వామి విషయం లో ఇతరుల మీద ఆధార పడటం సరిగా అనిపించలేదు. “మీ సన్నిహితులు చెప్పిన సమాధానాల ప్రకారం చూసుకుంటే.. వాళ్ళు కూడా ఇలాగే సహోద్యోగులతో సన్నిహితంగా ఉండి బయటకి వచ్చినవారా? అని నాకు అనుమానం గా ఉంది. మీకు ఆమె మీద అనుమానం ఉంటే మాత్రం ఈ సంబంధాన్ని వెంటనే రద్దు చేసుకోవడం మంచిది.
లేదు ఆమె మీద బాధ్యతతో ఈ ప్రశ్న అడిగాను అనుకుంటే.. వినండి.. మోసాలు ప్రతీ చోటా ఉన్నాయి. చిన్న కంపెనీల్లో కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది పెద్ద కంపెనీయా చిన్న కంపెనీయా అని కాదు. తనకి ఎందులో ఇంటరెస్ట్ ఉంది, తనకి కెరీర్ పరంగా ఏది ఉపయోగంగా ఉంటుంది. మీ ఇద్దరి ఆఫీసులకి అనుకూలంగా ఉంటుందో లేదో అంతవరకే. తనకోసం మీరున్నారని భరోసా ఇవ్వండి. తనతో సన్నిహితంగా ఉంటూ, ప్రేమను పంచండి.
ఆఫీసులో జరిగే ప్రతీ విషయాన్ని తనే చెబుతుంది. మీకెక్కడైనా అపశృతి కనిపిస్తే ఆ పరిస్థితి నించి బయటపడే మార్గం చెప్పండి. డిస్కస్ చేసుకోండి అన్ని విషయాలు సరదాగా… అనుమానంతో కాదు. అలాగే మీ ఆఫీసులో జరిగే విషయాలు కూడా మీరు పంచుకోండి. అంతేకాని సంకుచితంగా ఆలోచించి మీ జీవితాన్ని.. మిమ్మల్ని నమ్మి వచ్చే అమ్మాయి జీవితాన్ని ఇబ్బందుల్లో పడేయకండి.” అని సమాధానం ఇచ్చాను.
End of Article