పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్). ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సాహో సినిమా తరువాత సుజిత్ డైరెక్షన్ చేస్తున్న సినిమా ఇదే.
Video Advertisement
అందులో పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. దాంతో ఓజీ పై అంచనాలు అమాంతంగా పెరిగాయి. ఈ సినిమా అధికారికంగా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మేకర్స్ మూవీ గురించి అప్డేట్ ఇచ్చారు.
ఓజీ చిత్రం నుంచి ‘ఫైర్ స్ట్రోమ్’ పేరుతో అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఓజీ మూవీ షూటింగ్ ప్రారంభం అయినట్లు ఈ వీడియో ద్వారా చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో డైరెక్టర్ సుజీత్ ఈ మూవీ స్క్రిప్ట్ కోసం కష్టాన్ని చాలా క్రియేటివ్‌గా చూపించాడు. అలాగే ప్రోమో వీడియో లోని విజువల్స్ ఈ మూవీ పై మరింత హైప్‌ను క్రియేట్ చేశాయి.
ఇక ఈ ప్రోమో వీడియోని రూపొందించిన డైరెక్టర్ నిఖిల్ నాదెళ్ల తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వీడియో గురించి పలు విషయాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ “వీడియోను రూపొందించే ముందు ఈ మూవీ గురించి తెలుసు కోకూడదని అనుకున్నాను. ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి అన్నీ ఒక అభిమానిలా అన్నీ నేనే డీకోడ్ చేశాను. అదేవిధంగా వీడియో కోసం స్క్రిప్ట్ రాయడానికి వెళ్ళాను” అని తెలిపారు.
నిఖిల్, డైరెక్టర్ సుజీత్‌ల కాంబో ఇది మొదటి మూవీ కాదు. ఇంతకు ముందు సాహో సినిమాకి కూడా ట్రైలర్‌ను కట్ చేశారు. నిఖిల్ నాదెళ్ల వృత్తిరీత్యా ఎడిటర్. నిఖిల్ త్వరలో తొలి చిత్రానికి డైరెక్షన్ చేయబోతున్నాడు. ఆ మూవీని అప్ కమింగ్ బ్యానర్ లో చేయబోతున్నట్టుగా, కొత్తవారితో రొమాంటిక్ సినిమాని తెరకెక్కిస్తానని చెప్పారు. తాను మణిరత్నం, గౌతమ్ మీనన్‌ల అభిమానినని, నా సినిమా కూడా ఆ కోవలోనే ఉంటుందని వెల్లడించారు.
Also Read: “దసరా” సినిమాలో “పద్మ” పాత్రలో నటించిన యాక్టర్ ఎవరో తెలుసా..? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే..?