వాటర్ బాటిల్ కి అంత బిల్లా..? ఆ హోటల్ వాళ్ళకి ఆ కస్టమర్ ఎలా బుద్ది చెప్పారో తెలుసా.?

వాటర్ బాటిల్ కి అంత బిల్లా..? ఆ హోటల్ వాళ్ళకి ఆ కస్టమర్ ఎలా బుద్ది చెప్పారో తెలుసా.?

by Anudeep

Ads

మాములుగా ఓ కిరానా షాప్ లో ఉండే వాటర్ బాటిల్ కి, ఓ స్టార్ హోటల్ వాటర్ ప్రైస్ కి ఉండే తేడా మనకి తెలిసిందే. సాధారణం గా ఉండే ఎంఆర్పి రేటు కంటే ఎక్కువ ధర పెంచి అమ్ముతుంటారు. మనలో చాలా మంది గమనించినా పట్టించుకోకుండా వదిలేస్తుంటాం. ఒకవేళ ఎవరైనా అధికారులకు చెప్పినా కూడా పట్టించుకునే వారు ఎవరు ఉండరు. దీనితో హోటల్ వ్యాపారులు ఎక్కువ ధరకు అమ్ముతుంటారు.

Video Advertisement

man complaint against hotel

తాజాగా, ఇలా ఎక్కువ ధరకు అమ్మిన ఓ హోటల్ పై ఓ కస్టమర్ కేసు వేసి మరీ గెలిచాడు. దాదాపు ఐదేళ్ల పాటు ఈ వాటర్ బాటిల్ కేసు పై అతను తన పోరాటాన్ని కొనసాగించాడు. అందరిలా ..ఎందుకొచ్చిన గొడవలే..అని అతను వదిలేయలేదు. వివరం లోకి వెళితే, గుజరాత్ కు చెందిన రోహిత్‌ పాటిల్ (67) అనే వ్యక్తి అహ్మదాబాద్ లో నివాసం ఉంటారు. 2015 వ సంవత్సరం లో అక్టోబర్ నెలలో, అతను తన స్నేహితులతో కలిసి ఎస్‌జీ జాతీయ రహదారిపై ఉన్న ఓ హోటల్ లో భోజనం చేసాడు. ఓ వాటర్ బాటిల్ ని కూడా కూడా కొనుక్కోగా.. హోటల్ బిల్ పై వాటర్ బాటిల్ కి వేసిన ధరను చూస్తే అతనికి దిమ్మ తిరిగిపోయింది.

water bottle bill

ఒక్క వాటర్ బాటిల్ ధరను 164 రూపాయలు అమ్మారు మరి. ఇందులో 150 రూపాయలను బాటిల్ ధర గా సదరు హోటల్ పేర్కొంది. మిగతా 14 రూపాయలను సర్వీస్ ఛార్జ్ కింద పేర్కొంది. అయితే, ఇది అన్యాయమని రోహిత్ భావించాడు. ఆ బిల్లుని ఆధారం గా చేసుకుని వినియోగదారుల ఫోరమ్ లో రోహిత్ ఫిర్యాదు చేసాడు. అంతే కాదు, తనకు పరిహారం కింద లక్ష రూపాయలు ఇప్పించాలని కోరాడు. కోర్టు అతని ఫిర్యాదు స్వీకరించి విచారణ జరిపింది.

water bottle bill

విచారణ సమయం లో కూడా సదరు హోటల్ తాము అధిక ధర వసూలు చేయడం సమంజసమే అంటూ సమర్ధించుకుంది. మా హోటల్ సర్వీసుకు తగ్గట్లే ధరలు కూడా ఉంటాయని సమర్ధించుకుంది. అయితే, రెండు పక్షాల వాదనను కోర్టు విన్న తరువాత సదరు హోటల్ ను మందలించింది. ఓ సాదా వాటర్ సీసా ను అంత ధరకు అమ్మడం అన్యాయం గా పేర్కొంది. ఈ కేసు విషయం లో రోహిత్ పాటిల్ ను ఇబ్బందులకు లోను చేసినందుకు గాను 2500 పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. అలాగే, ఖర్చులకు మరో మూడు వేలు మొత్తం 5500 ల రూపాయలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ తీర్పు పై రోహిత్ సంతోషం వ్యక్తం చేసాడు. ఈ మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థ కు ఇస్తానని అన్నాడు. గతం లో కూడా తాను అధిక ధరలకు అమ్మే వారిపై కేసులు వేశానని, ఇదేమి మొదటి కేసు కాదని పేర్కొన్నాడు. చట్టవిరుద్ధం గా తన జేబులోంచి డబ్బులెందుకు చెల్లించాలని ప్రశ్నించాడు.

 


End of Article

You may also like