నా పేరు కుమార్. నేను బి టెక్ చదువుతున్న సమయం లో నాగ చైతన్య, రకుల్ జంటగా వచ్చిన ‘రారండోయ్ వేడుక చూద్దాం..’ మూవీ రిలీజ్ అయ్యింది. నేను సినిమాలు ఎక్కువగా చూస్తాను. ఈ మూవీ ట్రైలర్ బావుండటం తో సినిమాకి వెళ్ళా. నాకు ఈ సినిమా మొత్తం లో నచ్చింది హీరోయిన్ రకుల్. అంటే ఆమె కేరెక్టరైజేషన్. భ్రమరాంబ కేరెక్టర్ లో రకుల్ జీవించేసింది.

Video Advertisement

 

ఈ సినిమాకి ఆమె పాత్ర పెద్ద అసెట్. అయితే ఆ సినిమా చూసి వచ్చిన తర్వాత కూడా నన్ను ఆ పాత్ర వదిలిపోలేదు. అంతగా నచ్చేసింది. మొండిఘటం , పెంకి పిల్ల అయిన భ్రమరాంబని హీరో తన ప్రేమతో ఎలా మార్చుకుంటాడు అన్నదే ఈ మూవీ.

అయితే తన కష్టంలో, తన కాలక్షేపంలో, తన భయంలో, తన ఆనందంలో అన్నిట్లోను కథానాయకుడినే గుర్తు చేసుకుని, అన్నిటికీ అతడి సహచర్యమే ఆమె కోరుకుంటుంది భ్రమరాంబ. దీంతో నేను ఈ కేరెక్టర్ తో ప్రేమలో పడిపోయి.. అలంటి అమ్మాయి లైఫ్ లోకి వస్తే బావుంటుంది అనుకున్నా..

i want a women like that heroine.. but i learned a lesson..

ఇక తర్వాత కొంత కాలానికి నేను నా క్లాసుమేట్ విద్య ని లవ్ చేశా. ఆమె కూడా నన్ను ఇష్టపడింది. ఆమెది భ్రమరాంబ లాంటి కేరెక్టర్ ఏ. నాకు నచ్చిన క్వాలిటీస్ ఉన్న అమ్మాయే నాకు దొరికింది అనుకున్నా. దీంతో మేమిద్దరం త్వరగా క్లోజ్ అయిపోయాం. కొన్ని రోజులు బాగానే ఉంది. కానీ రాను రాను ఆమె ప్రవర్తన నాకు నచ్చట్లేదు. ఆ మొండితనం తో నాకు చిరాకు వచ్చేసింది. కొన్ని సందర్భాల్లో స్వార్థం గా ఉండేది.

i want a women like that heroine.. but i learned a lesson..
అలాగే తనకు నచ్చని పని ఏం చేసినా.. చాలా గొడవ చేసేది. నేను మాత్రం తనకి నచ్చిన పనులే చెయ్యాలి. నా నుంచి చాలా హెల్ప్ తీసుకొనేది కానీ ఒక్కోసారి నేను ఎవరో అన్నట్టు బెహేవ్ చేసేది. నేను ఎన్ని పనుల్లో ఉన్నా తనకి అవసరం రాగానే వెంటనే స్పందించాలి అని గొడవ చేసేది. విద్య తో ఎంతో అందం గా ఊహించుకున్న నా లైఫ్ ఆమె ప్రవర్తనతో నరకం లా తయారయ్యింది.

i want a women like that heroine.. but i learned a lesson..

అప్పుడు నాకు అర్థం అయ్యింది. సినిమాల్లో చూపించిన పాత్రలను బట్టి మన జీవితాలను ఊహించుకోకూడదు అని. ఆ పాత్రలను మనల్ని ఎంటర్టైన్ చేసేందుకు సృష్టిస్తారు. అటువంటి వాళ్లే కావాలి. అటువంటి జీవితం కావాలి అని మనం కోరుకోకూడదు అని నాకు అర్థం అయ్యింది. చివరికి విద్య తో నా రిలేషన్ ని ఎండ్ చేసుకున్నా. నాకు తగ్గ అమ్మాయి.. నన్ను అర్థం చేసుకొనే అమ్మాయి నా లైఫ్ లోకి వస్తుంది అని నేను ఎదురుచూస్తున్నాను.