Ads
గ్యాస్ సిలిండర్ ఎంత అవసరమో అంతే ప్రమాదకరం కూడా.. ఎందుకంటే గ్యాస్ లీక్ అయితే ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటాం. అందుకే మనం గ్యాస్ సిలిండర్ విషయం లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం.
Video Advertisement
కానీ, ఈ వీడియో తీసిన వ్యక్తి మాత్రం ఓ పిచ్చి పని చేసాడు. తన ఛానెల్ లో వ్యూస్ కోసం సరికొత్తగా వీడియోను తీయాలి అనుకున్నాడు. అందుకోసం అతను ఎలాంటి పని చేసాడో చూడండి.
గ్యాస్ బండ ను తీసుకెళ్లి రైలు పట్టాల మీద పెట్టాడు. నిజంగా అది చాలా డేంజరస్ స్టంట్ కదా.. మనం ఇంట్లో రోజు వాడుకునే సిలిండర్ విషయంలోనే ఎంతో జాగ్రత్తగా ఉంటాం. గ్యాస్ బండ అయిపోతే మార్చే సమయంలో కూడా అప్రమత్తంగా ఉండి పని చేసుకుంటాం. కానీ ఇక స్పీడ్ గా వెళ్లే ఒక రైలు గ్యాస్ బండని ఢీ కొడితే ఎంత ప్రమాదం జరుగుతుందో ఊహించగలమా..?
కానీ, ఈ వ్యక్తి అవేమి ఆలోచించలేదు. ట్రైన్ బండ ని గుద్దితే ఏమి జరుగుతోందో అన్న కుతూహలమో, లేక వ్యూస్ కోసమో ఇలాంటి పని చేసాడేమో కానీ, ఆ ట్రైన్ లో ప్రయాణం చేస్తున్న వారి గురించి ఆలోచించలేదు. అయితే.. అదృష్టవశాత్తు ఆ ట్రైన్ ని నడుపుతున్న డ్రైవర్ దూరం నుంచే ఈ బండని గుర్తించాడు కాబట్టి సరిపోయింది. వెంటనే ట్రైన్ ను నిలిపివేశాడు. లేకుంటే పెద్ద ప్రమాదం జరిగి, ప్రాణ నష్టం జరిగి ఉండేది. అందుకే ఎప్పుడూ ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు.
Watch Video:
End of Article