Ads
బొమ్మరిల్లు సినిమా పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది మొత్తం మీరే చేసారు అనో, ఒక్కసారి గుద్దుతే కొమ్ములు వస్తాయి అనే డైలాగులు గుర్తొస్తాయి. మరీ ముఖ్యంగా అంతేనా? ఇంకేం కావాలి వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ డైలాగ్. అబ్బో ఇలా ఎన్నో డైలాగులు నిజ జీవితంలో వాడేస్తుంటారు జనాలు. సినిమా విడుదల అయ్యి చాలా ఏళ్ళు గడిచినా, ఇప్పటికీ ఈ సినిమాకి ఉన్న క్రేజ్ పోలేదు. అందరూ సినిమాల్లోని కొన్ని డైలాగులను సరదా కోసం మాత్రమే వాడుతుంటారు. కానీ ఒకతను మాత్రం ఏకంగా అదే సినిమాని రియల్ లైఫ్ లో రీమేక్ చేశాడు.
Video Advertisement
అయితే బొమ్మరిల్లు సినిమాలో “వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ” అనే డైలాగ్ ఎంత ఫేమస్ అన్న సంగతి అప్పట్లో అందరి ఫోన్ల రింగ్టోన్ లే చెబుతాయి. తాజాగా ఆ సీన్ ను రీక్రియేట్ చెయ్యాలని ఒక యువకుడు పెద్ద స్టంటే చేశాడు. ఆ సినిమాలో జెనీలియా హీరో సిద్దార్థ్ ని మినర్వా కేఫ్ కి తీసుకెళుతుంది. ఈ మేరకు జేబులో డబ్బులు కాలీ చెయ్యాలి అనుకున్నాడో ఏమో, అతను కూడా మినర్వా కేఫ్ గురించి గూగుల్ లో వెతకడం మొదలు పెట్టాడు.
ఇదేంటి ఎంతకీ దొరకట్లేదు అని అనుకుంటుండగా.. ఆ పేరుతో వేరే రెస్టారెంట్ ను చూసాడట. ఇది ఆ సినిమాలో కేఫ్ లాగా లేదే! అందులోనేమో ఏదో కాకా హోటల్ లాగా ఉంటుంది, కానీ ఇందులో హోటల్ చూస్తే జేబు కాలీ అయ్యేలా ఉందే అనుకుంటూనే… సరేలే చూద్దాం అని ఆ హోటల్ కు వెళ్ళాడట. లోపలకి వెళ్లి, మెనూ చూస్తూ, రేట్లు అదిరిపోతున్నాయి అని లోలోపల అనుకుంటూనే ఒక ప్లేట్ ఘీ ఇడ్లీ ఆర్డర్ చేసాడు. ఆ రేటుకి.. వాళ్లు ఇచ్చిన ఫుడ్ క్వాంటిటీ.. బయట బిర్యానీ ఆర్డర్ చేస్తే కడుపునిండా తినొచ్చేమో అనుకున్నాడట. సరేలే ఇంకేం చేస్తాం అని మెల్లగా చిన్న చిన్న ముక్కలు సినిమాల్లో తిన్నట్టు తిన్నాడట. లాస్ట్ లో ఒక్కటి తక్కువైంది పుష్ప అన్నట్టు… ఒక కప్పు కాఫీ తక్కువైంది అని ఆర్డర్ చేశాడట. ఆఖరికి అది కూడా బహుశా ఇంత కాస్ట్లీ కాఫీ ఇప్పుడెనేమో తాగింది అనుకుంటూ తాగేశాడు.
చివరిగా హోటల్ నుండి వచ్చేస్తూ, ఏంటో సినిమాలో అనుకున్నట్టు అవ్వలేదు కానీ మొత్తానికి పెద్ద హోటల్ కి వెళ్లి తినే సరదా అయితే తీరిపోయింది. అంత బాగానే ఉంది కానీ, కనీసం ఆ సినిమాలో ఉన్న మినర్వా కేఫ్ అనేది నిజమేనా లేక కల్పితమా?? లేక అది తీసేసారా దీని గురించి ఎవరికైనా తెలుసా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడట.
అయితే బొమ్మరిల్లు సినిమా రిలీజ్ అయ్యింది 2006 లో కానీ, ఈ ఘటన జరిగింది కేవలం మూడేళ్ల క్రితమేనట. చూసారా ఈ విడ్డూరం? కాలం మారినా కొన్ని ఇష్టాలు, జ్ఞాపకాలు మారవని మళ్ళీ రుజువయ్యింది. ఆ యువకుడు చేసిన పని అంత సక్సెస్ అవ్వక పోయినా, జనాలకి, అతనికి ఒక చిన్ని జ్ఞాపకంగా మారింది.
End of Article