తెలిసీ తెలియక 4 ఏళ్ల అమ్మాయి చేసిన పని..తండ్రిని జైలుపాలు చేసింది.! విషయం ఏంటంటే.?

తెలిసీ తెలియక 4 ఏళ్ల అమ్మాయి చేసిన పని..తండ్రిని జైలుపాలు చేసింది.! విషయం ఏంటంటే.?

by Mohana Priya

Ads

మామూలుగా తండ్రి,కూతుళ్ళకి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది అంటారు. ఒక కూతురికి తన తండ్రి మొదటి హీరో అని చెప్తూ ఉంటారు. అయితే, అలా ఒక కూతురు తన తండ్రి గురించి గొప్పగా చెబుదామని చేసిన ఒక పని, ఆయనను జైలుకు వెళ్లేలా చేసింది. వివరాల్లోకి వెళితే, 2012 లో కెనడాలో నీవా అనే ఒక నాలుగేళ్ల అమ్మాయి ఒక పెయింటింగ్ వేసింది. ఆ పెయింటింగ్ ని తీసుకొని నీవా స్కూల్ కి వెళ్ళింది. ఆ పెయింటింగ్ తన టీచర్ కి చూపించింది. “టీచర్ ఈ పెయింటింగ్ నేనే వేశాను” అని నీవా చెప్పింది.

Video Advertisement

man was arrested due to his daughters drawing

 

ఆ పెయింటింగ్ లో ఒక వ్యక్తి ఒక గన్ పట్టుకొని ఉన్నాడు. ఆ టీచర్ పెయింటింగ్ చూసి, “ఈ ఫోటోలో గన్ పట్టుకొని ఉన్న వ్యక్తి ఎవరు?” అని నీవాని అడిగింది. అందుకు నీవా, “ఆయన మా నాన్న. చెడ్డ వాళ్లని చంపుతారు” అని చెప్పింది. దాంతో ఆ స్కూల్ వాళ్ళు నీవా వాళ్ళ తండ్రి మీద కంప్లైంట్ చేశారు. పోలీసులు వచ్చి ఆయనను అరెస్టు చేశారు. బాగా కఠినంగా ఇంటరాగేషన్ చేశారు. ఏమైనా ఆయుధాలు కానీ, లేదా డెడ్ బాడీస్ కానీ ఉన్నాయేమో అని ఇల్లంతా వెతికారు. కానీ అవేమీ దొరకలేదు.

man was arrested due to his daughters drawing

తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ పాప సరదాగా అబద్ధం చెప్పింది. పైన కనిపించే ఫోటోలోని బొమ్మ గన్ ఆధారంగానే నీవా ఆ బొమ్మ గీసింది. ఆ సమయంలో నీవా తల్లి 15 నెలల బిడ్డ జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. కానీ ఈ సంఘటన జరగడంతో ఆవిడ బిడ్డని వేరే వారికి అప్పగించి పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సి వచ్చిందట. ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్స్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన అలిసన్ స్కాట్ మాట్లాడుతూ, “పబ్లిక్ సేఫ్టీ కోణం నుండి, ఏ బిడ్డ అయినా తుపాకుల చిత్రాన్ని గీయడం మరియు ఇంట్లో తుపాకులు ఉన్నాయని చెప్పడం వలన లేనిపోని అనుమానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కారణంగా తల్లిదండ్రులతో, అలాగే పిల్లలతో మేము మాట్లాడాల్సి వస్తుంది” అని అన్నారు


End of Article

You may also like