Ads
ఒక పెద్ద కంపెనీ మేనేజర్ కి సమోసాలు అమ్ముకునే వ్యక్తికి మధ్య జరిగిన సంభాషణ చాలా ఆసక్తికరంగా ఉంది. ఢిల్లీ లో ఒక పెద్ద కంపెనీ ఉంది. దానికి ఎదురుగా ఒక చిన్న హోటల్ ఉంది. అక్కడ ఒక వ్యక్తి సమోసాలు తయారు చేసి అమ్ముతూ ఉంటున్నాడు.
Video Advertisement
ఎంతో రుచిగా ఆ సమోసాలు ఉంటాయి. పైగా చుట్టుపక్కల ఈ సమోసాలు బాగా ఫేమస్ అయ్యిపోయాయి కూడా. కార్పొరేట్ కంపెనీ ఉద్యోగులు సమోసాలు తినడానికి ఆ హోటల్ కి వస్తూ ఉంటారు.
Also Read: సీతారామం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి “ప్రభాస్” రావడంపై… ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్
అయితే ఒక రోజు ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీకు చెందిన మేనేజర్ సమోసాలు కొట్టుకు వస్తాడు. ఆ తర్వాత సమోసాలను తింటున్నాడు. అతను తింటూ మేనేజర్ సమోసాలు అమ్మే వ్యక్తితో మాటలు కలిపాడు. ఇక ఆ సంభాషణ ఇలా జరిగింది.
మేనేజర్:
సమోసాలు నువ్వు బాగా చేస్తున్నావు. మంచి నైపుణ్యం ఉంది. అయితే ఇంతటి తెలివి ఉండి కూడా నువ్వు దాన్ని అనవసరంగా వేస్ట్ చేసుకుంటున్నావు. నువ్వు నాలా పనిచేస్తే బడా కంపెనీ లో మేనేజర్ అయి ఉండే వాడివి.
సమోసాలు అమ్మే వ్యక్తి:
పదేళ్ల కిందట మీరు మీ కెరీర్ ని మొదలు పెట్టారు. నేను హోటల్ ని అప్పుడే పెట్టాను. అప్పుడు నేను నెలకి వెయ్యి రూపాయలు సంపాదించేవాడిని. కానీ ఇప్పుడు నేను పది వేల రూపాయల నెలకి సంపాదిస్తున్నాను. అలానే మీకు లక్ష రూపాయలు వస్తున్నాయి అంటే దాదాపు మీలానే నేను కూడా సంపాదిస్తున్నాను. పైగా నేను సమయాన్ని వృధా చేసుకోలేదు అన్నాడు.
Also Read: “వెస్టిండీస్” తో జరిగిన మ్యాచ్ లో… ఆ 3 ప్లేయర్స్ ఒకటే “జెర్సీ” వేసుకోడానికి కారణం ఏంటో తెలుసా?
మేనేజర్:
పెద్ద కంపెనీలో నేను లక్ష రూపాయల జీతం తెచ్చుకుంటున్నాను. కానీ నువ్వు ఇంకా చిన్న హోటల్ లోనే ఉన్నావు. చెప్పాలంటే నీ కంటే మంచి పొజిషన్ లో ఉన్నాను నేను. మరి నేనెలా టైమ్ వృధా చేసుకున్నాను..? నీ సమయమే వేస్ట్ అయిపోయింది.
సమోసాలు అమ్మే వ్యక్తి:
నేను అన్నది మీకు సరిగా అర్థం కాలేదు. పదేళ్ల కిందట నేను సున్నాతో హోటల్ మొదలుపెట్టాను. పైగా ఇప్పుడు నేను స్థానికంగా మంచి సమోసాలు అమ్మే వాడిగా పేరు తెచ్చుకున్నాను. కానీ మీ విషయంలో అలాంటిదేమీ లేదు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక వేళ రేపు నేను పని చేయలేకపోతే నా కొడుకు ఈ వ్యాపారాన్ని తీసుకుని డబ్బులు సంపాదిస్తాడు.
అప్పుడు ఇంకా బాగా సంపాదిస్తే పెద్ద హోటల్ కూడా మొదలు పెట్టొచ్చు. కానీ మీరు చేస్తున్న ఉద్యోగం మీ కొడుకులకి ఇవ్వలేరు. అంటే మళ్ళీ 0 నుండి మీ జీవితాన్ని మొదలు పెట్టాలి.
మీ అంత నైపుణ్యాన్ని నేర్చుకుని కష్టపడితే కానీ మళ్లీ ఆ స్థానానికి చేరుకోలేరు. కానీ నా పిల్లలు అలా కాదు. రాబోయే పది నుండి పదిహేను సంవత్సరాలలో వాళ్ళు మంచి స్థితికి చేరుకుంటారు. ఇలా సమోసాలు అమ్మే వ్యక్తి జవాబిచ్చే సరికి మేనేజర్ నోట నుండి ఒక్క మాట కూడా రాలేదు. నిజంగా వ్యాపారంలో రాణించాలనుకునే వాళ్లకి ఈ సంభాషణ ఎంతో స్ఫూర్తిదాయకం కదా…! మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటో తెలపండి.
Also Read: బీపీతో బాధపడుతున్నారా..? అయితే మందులు లేకుండా ఇలా కంట్రోల్ చేసుకోండి..!
End of Article