Ads
సంప్రదాయాలు అంటే ఎప్పటినుండో ఆచరిస్తూ వస్తున్న కొన్ని విషయాలు.కొన్ని సందర్భాలలో కొంతమంది చేసే విషయాలను ప్రశ్నిస్తే ఇది మా ఆచారం అని చెప్తూ ఉంటారు.అసలు సరిగ్గా ఆలోచిస్తే అసలు ఆ ఆచారం ఎలా పుట్టిందో,ఎందుకు మొదలైందో తెలుస్తుంది.మనకు కనిపించే సంప్రదాయాల వెనకాల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి కానీ చాలాసార్లు ఆ ఉపయోగాలు అన్ని ఆనాటి కాలానికి అనుగుణంగా ఉపయోగపడేవి అయ్యి ఉంటాయి.అయితే మంగళవారం తలస్నానం చెయ్యకూడదు అనే ఆచారం వెనకాల ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Video Advertisement
అనాది కాలంలో ఇంట్లో నీరు వచ్చే ఏర్పాటు గాని ,నీటిని ఎక్కువగా దాచుకొనే అవకాశం గాని ఉండేది కాదు.నీటిని తేవాలంటే ఎంతో దూరం నడిచి వెళ్లి తీసుకురావాల్సి వచ్చేది.దీంతో స్నానాలకు చాలావరకు దగ్గరలో ఉన్న నదులకు గాని లేదా కాలువ ల దగ్గరకి గాని వెళ్లేవారు.అయితే కొన్ని రోజుల తర్వాత ఇంట్లోనే బాత్ రూమ్ లు నిర్మించుకున్నారు .కానీ నీటి కోసం చాలా దూరం నడిచి తేవాల్సిన ఇబ్బందులు మాత్రం తప్పలేదు.దీంతో ఆడవారు తలస్నానం చెయ్యడానికి ఎంతో నీరు అవసరం అవుతుంది.
కాబట్టి మంగళవారం ఒకరోజు తల స్నానం చెయ్యడం ఆపిన నీటి వాడకం కొంత తగ్గుతుంది. ఎంతో దూరం నుండి నీటిని తెచ్చే అవసరం కూడా తప్పుతుంది అని మంగళవారం తల స్నానం చెయ్యకూడదు అనే నియమాన్ని పెట్టారు.అంతేకాకుండా ప్రతీరోజు తల స్నానం చేస్తే తల నొప్పి ,తల దిమ్ము వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారంలో ఒక్కరోజు తల స్నానం చెయ్యడం ఆపిన ఇటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయని కూడా మంగళవారం తల స్నానం చెయ్యకూడదు అనే నియమాన్ని పెట్టినట్లు తెలుస్తుంది.
End of Article