Ads
సాధారణంగా ఓటీటీ అంటే చాలా మందికి గుర్తొచ్చేది వెబ్ సిరీస్. కానీ ఇందులో సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి. మన ఎంతో మంది హీరోల సినిమాలు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ప్రముఖ హీరో మనోజ్ బాజ్‌పేయి నటించిన సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై సినిమా కూడా విడుదల అయ్యింది. ఇది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
- సినిమా : సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై
- నటీనటులు : మనోజ్ బాజ్‌పేయి, సూర్య మోహన్ కులశ్రేష్ఠ, విపిన్ శర్మ, అద్రిజా సిన్హా
- నిర్మాత : మలేష్ భానుషాలి, వినోద్ భానుషాలి, విశాల్ గుర్నాని, ఆసిఫ్ షేక్
- దర్శకత్వం : అపూర్వ్ సింగ్ కర్కి
- ఛాయాగ్రహణం : అర్జున్ కుక్రేటి
- ఓటీటీ వేదిక : జీ 5
- విడుదల తేదీ: మే 23 , 2023
స్టోరీ:
ఒక మైనర్ అయిన అమ్మాయి (అద్రిజ).. అందరు దేవుడిగా కొలిచే ఒక బాబా తనను వేధించాడని.. అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నిర్ణయించుకుంటుంది. దీంతో ఆమెకు ఈ సమాజం లో అందరు వ్యతిరేకం గా మారతారు. దీంతో పీసీ సోలంకి (మనోజ్) అనే న్యాయవాది ఆమెకు ఆశ్రయం ఇచ్చి.. 5 సంవత్సరాల పాటు పోరాడి ఆమెకు న్యాయం జరిగేలా చూస్తాడు. నిజం తన పక్షాన ఉన్నప్పుడు ఒక సామాన్యుడు నిజాయితీ మరియు చిత్తశుద్ధితో వ్యవస్థను ఎలా ఎదుర్కోగలడో ఈ సినిమా చూపిస్తుంది. ఈ నేపథ్యం లో జరిగిన పరిణామాల సమాహారమే ఈ చిత్రం.
రివ్యూ:
కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారం గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు అపూర్వ్ సింగ్ కర్కి. అయితే ఇటువంటి చిత్రాల్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించడానికి చాలా అడ్డంకులు వస్తాయి. కానీ దర్శకుడు చాలా తెలివిగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అలాగే ఇటువంటి కోర్ట్ రూమ్ డ్రామాల్లో డైలాగ్స్ హీరో పాత్రని పోషిస్తాయి. దీపక్ కింరానీ అద్భుతమైన డైలాగ్స్ అందించారు.
ఈ మూవీ కి మెయిన్ పిల్లర్ మనోజ్ బాజ్‌పేయి. ఈయన ఎంత గొప్ప నటుడో ఈ చిత్రం మరోసారి నిరూపిస్తుంది. ఈ చిత్రాన్ని ఆయన భుజాలపైన మోశారు. తనపై తనకు నమ్మకం లేని ఒక లాయర్ నుంచి అతడు ఎలా మారాడు అన్నది సరిగ్గా చూపించాడు మనోజ్. అద్రిజ కూడా అవకాశం వచ్చినప్పుడు తన నటనతో చూపు తిప్పుకోనివ్వలేదు. ఇతర నటీనటులు పరిధి మేరకు నటించారు.
డైరెక్టర్ చాలా బాలెన్సుడ్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చాలా సున్నితమైన కథనంతో, స్క్రీన్‌ప్లేను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసారు. ఇక సంగీతం, సినిమాటోగ్రఫీ ఈ చిత్ర టోన్ కి తగ్గట్టు ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
- మనోజ్ బాజ్‌పేయి
- స్టోరీ పాయింట్
- దర్శకత్వం
మైనస్ పాయింట్స్
- ఎమోషన్స్ లేకపోవడం
రేటింగ్:
3 .5 /5
ట్యాగ్ లైన్:
మనోజ్ బాజ్‌పేయి పెర్ఫార్మన్స్ కోసం ఈ చిత్రాన్ని ఖచ్చితం గా చూడాలి.
watch trailer :
End of Article