నిశ్చితార్థమై లాక్ డౌన్ వల్ల పెళ్లి రద్దైన వారిలో కొత్త టెన్షన్…మరో బ్యాడ్ న్యూస్ ఏంటంటే?

నిశ్చితార్థమై లాక్ డౌన్ వల్ల పెళ్లి రద్దైన వారిలో కొత్త టెన్షన్…మరో బ్యాడ్ న్యూస్ ఏంటంటే?

by Megha Varna

Ads

మాములుగా సమ్మర్ అంటే పెళ్లిళ్ల సీజన్ .కానీ ఈ సమ్మర్లో తెలుగు రాష్ట్రాలలతో పాటుగా దేశ వ్యాప్తంగా కొన్ని లక్షల పెళ్లిళ్లు జరగాల్సి ఉంది. కానీ అసలు పెళ్లిళ్ల మాట కూడా లేకుండా పోయింది. ఎందుకంటే దేశంలో కరోనా వైరస్ వాళ్ళ జరుగుతున్నా లాక్ డౌన్ దీనికి కారణం . పెళ్లిళ్ల మాట అటు ఉంచితే స్వేచ్ఛగా బయట తిరిగాడినికే లేదు .. సామజిక దూరం పాటించాలంటూ వచ్చిన పిలుపు కారణంగా ఇప్పటికే ముహుర్తాలు పెట్టుకున్న చాలా పెళ్లిళ్లు రద్దు అయ్యాయి ..కాగా మే నెలలో కూడా ఇవే ఆంక్షలు కొనసాగేలా ఉన్నాయి ..

Video Advertisement

కరోనా అదుపులోకి వచ్చి అంత బాగునట్లయితే జూన్ జులై తర్వాత ఈ ఆంక్షలు ఎత్తివేసి సాధారణ పరిస్థితి వచ్చేలా కనిపిస్తుంది . కాగా పెళ్లి కానీ వారందరు పెళ్లి పీటలు ఎక్కడానికి జూన్ జులై కోసం ఎదురు చూస్తున్నారు .అప్పటికైనా పరిస్థితులు సర్దుకుంటే ఎపుడైనా పెళ్లి చేసుకోవచ్చు అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు, కాగా వారు అంతకంటే ఆందోళన చెందే విషయం ఒకటి పురోహితులు చెప్తున్నట్లు సోషల్ మీడియా లో ఒక వార్త వైరల్ అవుతుంది ..

జూన్ ,జులై ,ఆగెస్ట్ నెలలలో పెళ్లిళ్లకు ముహుర్తాలు లేవని అందులో ఒక మాసం ఆషాడ మాసం కాగా మిగత రెండు నెలలు మూడాలు ఉన్నాయంటున్నారు .కావున పెళ్లిళ్లు చేసుకోవాలంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్ వరుకు ఎదురు చూపులు తప్పేలా లేవు . కార్తీక మాసం కంటే కూడా నవంబర్ వరుకు ఆగితే మంచి ముహుర్తాలు ఉన్నాయని పండితులు చెప్తున్నారంట . ఇప్పటికే పెళ్లి ముహర్తలు కుదుర్చుకున్నవాళ్ళు, నిశ్చితార్థం చేసుకున్నవాళ్ళు అన్ని నెలలు ఆగడం ఎలా అని ఆందోళన చెందుతున్నారు .

పెళ్లి కానీ ప్రసాదుల పరిస్థితి దారుణంగా మారింది .లాక్ డౌన్ ఎత్తి వేసిన వెంటనే కొందరు పెళ్లిళ్లకు సిద్ధం అవుతున్నారు . పెళ్లి మే వరుకు వాయిదా వేసుకొని మే లో చేసుకోవాలనుకునే వారు కూడా వున్నారు . అయితే కొందరు మూడాలు ఉన్నాయి, జూన్ జులైలో పెళ్లిళ్లు చేసుకోవడానికి మంచి ముహుర్తాలు లేవు అంటూ వస్తున్న వార్తలలో నిజం లేదు అంటున్నారు ..ఇంతకీ విషయం ఏంటనేది ఆ అయ్యవార్లే చెప్పాలి .


End of Article

You may also like