Ads
మాఘ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే అమావాస్యను మాఘమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు ఈరోజు పవిత్ర నది స్నానం దానాలకి ప్రాముఖ్యత ఉంటుంది ఈరోజు మౌనవ్రతం ఉండి ఉపవాసం చేస్తే పుణ్యఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం. ఈ రోజున మన పూర్వీకులను పూజించటానికి అనువైన రోజు. అమావాస్య తిధి చాలా ముఖ్యమైనది అమావాస్యనాడు ఏ గ్రహ ప్రభావము పనిచేయదు.
Video Advertisement
image source: amrit vichar
అందుకే ఈ రోజున ఎలాంటి పని ప్రారంభించిన విజయవంతం అవుతుంది. నవగ్రహాల వల్ల వచ్చే సమస్యలు పోవాలంటే అమావాస్య పరిహారాలు చేయాలని చెబుతారు. అమావాస్య రోజున నిరుపేదలకు ఆహారం అందించడం సమీపంలోని ఆలయాన్ని సందర్శించడం ఈరోజున పూర్తిగా ఉపవాసం ఉండడం మాంసాహారం తినకుండా ఉండటం ఆవులకు పాలకూర అరటిపండు చింతపండు బెల్లం మొదలైనవి తినిపించడం రావి చెట్టుని పూజించటం ద్వారా సకల శుభాలని పొందవచ్చు అలాగే ఈరోజు గోల్డ్ కత్తిరించడం హెయిర్ కటింగ్, షేవింగ్ వంటివి చేయకూడదు. నిజానికి ఈరోజు మన పూర్వీకులు చాలా ఆకలి దాహంతో ఉంటారు.
అందుకే వారికి తరపడం ఇవ్వటం విశేషం. తప్పని జనం భూమి గురుత్వాకర్షణ శక్తి కంటే మహత్తయినదని విశ్వాసం. మనం తర్పణం ఇవ్వడం నైవేద్యాలను సమర్పించడం ద్వారా కోట్ల మేళ్ల దూరంలో ఉన్నప్పటికీ మన పెద్దల యొక్క దాహాన్ని ఆకలిని తీర్చవచ్చు. అలాగే మనం సమర్పించే తర్పడాన్ని పితృదేవతలు సూక్ష్మంగా స్వీకరిస్తారని ఆపై ఆశీర్వదిస్తారని పెద్దలు చెప్తారు.
అలాగే రావి చెట్టుకు నీరు పోసి 18 సార్లు ప్రదక్షిణం చేయడం ద్వారా సర్వ శుభాలు కలుగుతాయి చెట్టు కింద దీపం వెలిగించి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే పితృ దోషాల నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే ఈ రోజున దానం చేయడం వలన 16 రెట్లు ఎక్కువ ఫలాలు లభిస్తాయని నమ్ముతారు అలాగే ఈరోజు సూర్య భగవానుడికి నీరు సమర్పించడం మర్చిపోవద్దు
End of Article